
ప్రభాస్ హీరోగా నటిస్తున్న `సలార్` సినిమా వాయిదా పడబోతుందనే వార్తలు గత రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం, ఔట్‌పుట్‌పై దర్శకుడు సంతృప్తిగా లేకపోవడంతో సినిమాని వాయిదా వేయాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించలేదు, కానీ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అధికారికంగా `సలార్` పోస్ట్ పోన్ విషయాన్ని వెల్లడించారు.
`సలార్` మూవీ సెప్టెంబర్ 28న రావడం లేదు, నవంబర్‌కి పోస్ట్ పోన్ అవుతుందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయని దీంతో హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారని, కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు తరణ్ ఆదర్శ్. సీజీ వర్క్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సాటిస్పై కాకపోవడం వల్లే ఈ వాయిదా అని తెలుస్తుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ శుక్రవారం వరకు అందించాల్సి ఉంది, కానీ అవి రాకపోవడంతో రిస్క్ తీసుకోవడం సరికాదని దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈచిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `సలార్` చిత్రానికి `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అది అత్యధిక వ్యూస్ పొందిన గ్లింప్స్ గా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ దాదాపు 350కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుందని సమాచారం.
ఇందులో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, `కేజీఎఫ్` నటుడు యష్ కూడా గెస్ట్ గా మెరబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగాన్ని `సలార్‌ః సీజ్‌ఫైర్`తో విడుదల చేయనున్నారు. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. `సలార్` ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. 500కే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారాకొనుగోలు కావడం విశేషం. ఇప్పుడు అవన్నీ వెనక్కి ఇవ్వబోతున్నారు.