
టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియాకు వెళ్ళతోబున్నాడు మాస్ హహారాజ్ రవితేజ. రీసెంట్ గా ఆయన నటించిన ధమాకా (Dhamaka),వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో దిల్ ఖుష్ అయ్యాడు సీనియర్ హీరో. ఇక ఆతరువాత వచ్చిన ఆ తర్వాత వచ్చిన రావణాసుర(Ravanasura)సినిమా పర్వాలేదు అనిపించింది. త్వరలో టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఇక మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లోనే మొదటి పీరియాడిక్ సినిమా కావడంతో..మూవీ పై సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దసరాకు ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు మూవీటీమ్.
రవితేజకు సబంధించిన సినిమాలు వరుసగా రిలీజ్ కు ఉన్నాయి. ఒకటి తరువాత ఒకటి సెట్స్ ఎక్కిస్తున్నాడు మాస్ మహారాజ్. సంక్రాంతికి ఈగల్ అనే మరో సినిమాని, ఆ తర్వాత గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో ఇంకో సినిమాని.. ఇలా వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు రవితేజ. ఇక ఎప్పుడూ షూటింగ్ లు.. సినిమాలు ఇదే హడావిడి కాకుండా.. ఫ్యామిలీ అంతటితో కలిసి భారీ టూర్ ను ప్లాన్ చేశాడు మస్ మహారాజ్.
తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేశాడు మాస్ మహారాజ. తన ఫ్యామిలీతో కలిసి జపాన్(Japan) కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు రవితేజ. సాధారణంగా రవితేజ తన ఫ్యామిలీ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒక పిక్ షేర్ చేస్తాడు. తాజాగా జపాన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని రవితేజ షేర్ చేయడం విశేషం. టోక్యో నుంచి తనవి కూడా కొన్ని సింగిల్ ఫోటోలు షేర్ చేశాడు రవితేజ.
రవితేజతో పాటు రవితేజ భార్య, అతని తనయుడు మహాధన్, కూతురు మోక్షదలతో పాటు రవితేజ తమ్ముడి కొడుకులు కూడా జపాన్ వెళ్లారు. జపాన్ టోక్యోలోని ప్రముఖ ప్లేస్ అయిన శిబూయ క్రాసింగ్ దగ్గర ఫ్యామిలీ అందరితో కలిసి దిగిన ఫోటోలను రవితేజ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలని షేర్ చేస్తూ.. ఫ్యామిలీ అంటూ లవ్ సింబల్ పెట్టాడు. మరో ఫోటోని షేర్ చేస్తూ.. టోక్యోలో ఇది మన RTC క్రాస్ రోడ్స్ లాంటిది అన్నమాట. కానీ రెండూ సేమ్ కావు అని సరదాగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.