
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ (OG). రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా స్టయిలిష్ లుక్‌లో సరికొత్తగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో విశేషాలుపై ఓ రేంజిలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో నటిస్తున్న నటుడు అజయ్ ఘోష్ తన పాత్ర గురించి చెప్పారు.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ...ఓజీ చిత్రంలో తాను రిటైర్డ్ గ్యాంగస్టర్ గా కనిపించనున్నట్లు చెప్పారు. అలాగే తనతో పాటు మొట్టై రాజేంద్ర, జీవా వంటివారు కనిపిస్తారన్నారు. తాము రిటైర్ అయ్యి ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా అప్పటి కబుర్లుతో బిల్డప్ ఇస్తూ నవ్విస్తామని అన్నారు. కొద్దిగా విలినీ ఉంటుందని చెప్పారు. పవన్ కాంబినేషన్ లో సీన్స్ ఉన్నాయని, తమ డేట్స్ నాలుగైదు రోజులు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
ఇక ఈ రోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే కానుకగా అభిమానుల కోసం ‘ఓజీ’ వీడియో గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది.‘పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్ కడగకలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగివస్తున్నాడంటే..’ అంటూ 101 సెకన్ల నిడివితో కూడిన గ్లింప్స్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో విడుదలైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఎప్పటిలానే పవన్ తన లుక్స్, డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలో పవన్‌కు (Pawan kalyan) జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కనించనుంది.