దుమ్ములేపుతున్న `సలార్‌`..ఇక్కడ నెంబర్‌ 1, అక్కడ నెంబర్‌ 3.. ప్రభాస్‌ రేంజ్‌ ఇలా ఉంటుంది..

Published : Jan 27, 2024, 05:44 PM IST
దుమ్ములేపుతున్న `సలార్‌`..ఇక్కడ నెంబర్‌ 1, అక్కడ నెంబర్‌ 3.. ప్రభాస్‌ రేంజ్‌ ఇలా ఉంటుంది..

సారాంశం

ప్రభాస్‌ హీరోగా నటించిన `సలార్‌` మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇది దుమ్మురేపుతుంది. టాప్‌లో ట్రెండింగ్‌ అవుతూ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. 

ప్రభాస్‌ హీరోగా నటించిన `సలార్‌` మూవీ గతేడాది డిసెంబర్‌ 22న విడుదలైంది. క్రిస్మస్‌ కానుకగా వచ్చిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. సుమారు ఏడు వందల యాభై కోట్లు వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఎలా ఉంటుందో చూపించింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. నార్త్ లో `డంకీ` ఎఫెక్ట్ లేకపోతే ఈ మూవీ వెయ్యి కోట్లది దాటేది. 

ఈ మూవీ గత వారమే ఓటీటీలోకి వచ్చింది. విడుదలైన నెల రోజల కంటే ముందే డిజిటల్‌లోకి రావడం అంతా ఆశ్చర్యపరిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. నెట్‌ ఫ్లిక్స్‌లో `సలార్‌` స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ మూవీ ఇండియా వైడ్‌గా, అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ ట్రెండింగ్‌లో ఉంది. ఇండియాలో నెంబర్‌ 1 ప్లేస్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా ఈ మూవీ మూడో స్థానంలో ట్రెండింగ్‌ అవుతుంది. దీంతో ఈ సినిమాని ఓటీటీలో భారీగా చూస్తున్నారు. మిలియన్స్ వ్యూస్‌ పొందుతుంది. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. 

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ `దేవా`గా నటించారు. ఆయనకు జోడీగా శృతి హాసన్‌ కనిపించింది. ఇక ప్రభాస్‌ స్నేహితుడిగా వరధరాజ మన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించారు. ఆయన తండ్రి రాజమన్నార్‌గా జగపతిబాబు నటించిన విషయం తెలిసిందే. చిన్నప్పట్నుంచి వరదరాజ మన్నార్‌, దేవారధ మంచి స్నేహితులు. కానీ ఓ ఘటనతో దేవా ఖాన్సార్‌ రాజ్యాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. 

ఆపదలో ఉన్న నేపథ్యంలో ఖాన్సార్‌ పై పట్టు పోతుందనుకునే సమయంలోనే వరధరాజ మన్నార్ ఆపదలో ఉన్న నేపథ్యంలో స్నేహితుడి కోసం దేవా వస్తాడు. ప్రత్యర్థులను, అసమ్మతిని అంతం చేసే పని పడతాడు. మరి స్నేహం కోసం ప్రాణాలిచ్చే ఈ స్నేహితులు ఎందుకు విడిపోయారు, శత్రువులుగా ఎందుకు మారారు అనేది రెండో పార్ట్‌లో చూపించబోతున్నారు. మొదటి పార్ట్ ని `సలార్‌ః సీజ్‌ ఫైర్‌`తో విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో పార్ట్ ని `సలార్‌ః శౌర్యాంగపర్వం` పేరుతో విడుదల చేయబోతున్నారు. ఈ `సలార్‌ 2`ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. వచ్చే ఏడాది ఈ మూవీ ఆడియెన్స్ కి రాబోతుందని తెలుస్తుంది. 

Read more: చెత్త సినిమా, విసిరి కొట్టాలనిపించింది.. రాధిక వివాదాస్పద వ్యాఖ్యలు యానిమల్ మూవీపైనేనా
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?