#Alluarjun అల్లు అర్జున్ నెక్ట్స్ బోయపాటి తో కాదా...మరి ?

Published : Jan 27, 2024, 04:45 PM IST
#Alluarjun అల్లు అర్జున్ నెక్ట్స్ బోయపాటి తో కాదా...మరి ?

సారాంశం

 అల్లు అర్జున్ (Allu Arjun)-బోయ‌పాటి (Boyapati Sreenu ) క‌ల‌యిక‌లో రూపొందిన స‌రైనోడు మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచి అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 


త్రివిక్రమ్ “గుంటూరు కారం” సినిమా చేస్తున్న సమయంలోనే హారిక హాసిని క్రియేషన్స్ అల్లు అర్జున్ తమ తదుపరి చిత్రంలో నటిస్తుందని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. గుంటూరు కారం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటంతో ప్రాజెక్టులు ముందుకు వెనక్కి వెల్తున్నాయి. తాజాగా  బోయ‌పాటి శ్రీ‌ను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం సిద్ధం అవుతోందంటూ ప్రకటన వచ్చింది. దాంతో ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరో అని అందరూ ఫిక్స్ అయ్యిపోయారు. గుంటూరు కారం రిజల్ట్ చూసి బన్నీ ఈ డెసిషన్ తీసుకున్నాడని,త్రివిక్రమ్ ని ప్రక్కన పెట్టేసాడని ప్రచారం మొదలైంది. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం , ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ సంవత్సరం చివర్లో దర్శకుడు అట్లీ చిత్రాన్ని  ప్రారంభిస్తారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన తన తొలి హిందీ చిత్రం “జవాన్”తో భారీ బ్లాక్ బస్టర్ చేసిన అట్లీ కుమార్‌కు అనేక ఛాయిస్ లు ఉన్నాయి. అయితే, వాటిన్నటినీ ప్రక్కన పెట్టి  అతను మొదట అల్లు అర్జున్ చిత్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి త్వరలోనే అల్లు అర్జున్ ,అట్లీ  ప్రాజెక్ట్ ఎనౌన్సమెంట్ వస్తుందంటున్నారు. 
 
అయితే దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌తో కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ఉంది. గీతా ఆర్ట్స్ ఇటీవల బోయపాటి శ్రీనుతో “భారీ” చిత్రాన్ని ప్రకటించింది కానీ హీరో పేరును వెల్లడించలేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తాడని రూమర్స్ ఉన్నప్పటికీ, ‘ఐకాన్ స్టార్’ చివరి నిమిషంలో తన ప్లాన్స్ మార్చుకుంటాడు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు.  ఆ ప్రాజెక్టు తమిళ దర్శకుడు సూర్యతో బోయపాటి చేయబోయే సినిమా గురించి అంటున్నారు.

ఏదైమైనా అల్లు అర్జున్ (Allu Arjun)-బోయ‌పాటి (Boyapati Sreenu ) క‌ల‌యిక‌లో రూపొందిన స‌రైనోడు మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచి అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ల‌యిక‌లో మ‌రో భారీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుందంటే మాత్రం లెక్కలు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టి మొత్తం ప్యాన్ ఇండియాపైనే ఉంది. రీజనల్ సినిమాలు కష్టం అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి