
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల `ఆదిపురుష్` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. మోడ్రన్ రామాయణం స్టయిల్‌లో దర్శకుడు ఓ రౌత్ ఈ సినిమాని తెరకెక్కించారు. జూన్ 16న విడుదలైన ఈ సినిమాకి నెగటివ్ టాక్ వస్తోంది. అయినా రూ.450కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం. త్వరలో ప్రభాస్ మరో సినిమాతో రాబోతున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న `సలార్` చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్‌లో రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ రకంగా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. టార్గెట్ ఓం రౌత్ అనేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మీడియాతో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, `సలార్` సినిమా గురించి చెప్పారు. `కొందరు సీజీలో పెద్ద సినిమాలు చేస్తారు.. మేం దుమ్ములో చేస్తాం` అని తెలిపారు. ప్రభాస్‌ది కూడా అలానే ఉంటుందా? అని అడగ్గా, సినిమా చూడండి` అంటూ దాట వేశారు. అయితే ప్రశాంత్ నీల్ మాట్లాడిన సందర్భం ఏదో కానీ, ఇది ప్రస్తుతం ఓం రౌత్‌కి యాప్ట్ గా ఉందని అంటున్నారు నెటిజన్లు.
ప్రశాంత్ నీల్.. ఈ వ్యాఖ్యలు దర్శకుడు ఓం రౌత్‌ని ఉద్దేశించే అని అంటున్నారు నెటిజన్లు. అంతే కాదు ఓం రౌత్‌కి పర్‌ఫెక్ట్ గా సెట్ అవుతాయని అంటున్నారు. ఓం రౌత్ `ఆదిపురుష్` సినిమాని సీజీలోనే చేశారు. కేవలం ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడి పాత్ర దేవదత్త, లక్ష్మణుడు సన్నీ సింగ్, విభీషణుడు, రావణుడి కొడుకు, అతని సేనాపతి, తన భార్య, సోదరి పాత్రలు మాత్రమే నిజం, మిగిలినవన్నీ సీజీలో క్రియేట్ చేసినవే. బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ మొత్తం సీజీలోనే చేశారని సమాచారం. సినిమా 70శాతం సీజీలోనే చేశారు. కేవలం ఓ ముప్పై శాతం మాత్రమే రియలిస్టిక్ పాత్రలపై తెరకెక్కించారు. ఓ రకంగా `ఆదిపురుష్` పూర్తి సీజీ మూవీ అని చెప్పొచ్చు.
ఇక ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న `సలార్` చిత్రం చివరి చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాని కోల్ మైనింగ్, ఇతర రియల్ లొకేషన్లలో తెరకెక్కించారు. మొత్తం రా, రస్టింగ్‌గా సినిమా సాగుతున్న నేపథ్యంలో దుమ్ములోనే చాలా వరకు సినిమాని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్లు `సలార్`ని, `ఆదిపురుష్`లకు దగ్గరగా ఉండటం విశేషం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు ఓం రౌత్‌ని టార్గెట్ చేస్తూ, ట్యాగ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దర్శకుడు ఓం కి ఇది చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందంటున్నారు.