‘అందుకే ఈ నిర్ణయం తీసుకున్న’.. ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ లాస్ట్ సెల్ఫీ వీడియో..

By Asianet News  |  First Published Jun 27, 2023, 4:46 PM IST

ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఎన్టీఆర్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన చనిపోవడానికి రీజన్ ఏంటనేది తెలియని క్రమంలో.. తాజాగా శ్యామ్ లాస్ట్ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. 
 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ (Shyam)  నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అయితే  శ్యామ్ ది సూసైడ్ కాదని, దీని వెనకాల ఏవరో హస్తం ఉందని తారక్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ ఉరివేసుకుంటే చేతికి గాయాలేంటనీ, నేలపై కాళ్లు వాళి ఉండటం ఏంటనీ సందేహిస్తున్నారు. శ్యామ్ ఎందుకు చనిపోయాడనే దాని గురించే అందరూ ఆలోచిస్తున్నారు. 

ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించిన విషయం తెలిసిందే. శ్యామ్ మరణంపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొద్ది గంటల కింద ఎన్టీఆర్ కూడా తన అభిమాని మృతికి ఎమోషనల్ అయ్యారు. రీజన్ ఏంటనే దానిపై ప్రభుత్వ అధికారులు దర్యాప్తు చేయాలని కోరారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు నిన్నటి నుంచి We Want Justice for Shyam NTR  అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉంటే.. తాజాగా శ్యామ్ మరణించడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తను చనిపోయేముందుకు కొన్ని విషయాలను వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు. వీడియో ప్రకారం.. ‘అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేనున్నా లేకున్నా హ్యాపీగా ఉండండి. నన్ను ఇన్ని రోజులు పెంచినందుకు థ్యాంక్యూ. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేనున్నా లాభం లేదు. సరేనా మమ్మీ డాడీ. మీరంటే చాలా ప్రేమ ఉంది. 

మరోవిషయం.. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నావల్ల కాదు జాబ్ చేయడం కూడా. మిస్ యూ అమ్మానాన్న. అలాగే సాయి శ్రీనన్న మిస్ అన్న. ఐ లవ్ యూఅన్న. బిగ్గెస్ బ్రదర్ నువ్వే అన్న. మళ్లీ జన్మంటూ ఉంటూ నీ శిష్యుడిగా పుట్టాలి అన్న. లవ్ యూ అన్న’ అంటూ చివరిగా మాట్లాడాడు. ఈ వీడియో అనంతరం మరణించినట్టు తెలుస్తోంది. 

ఈ విడియోతో అందరి నోర్లు ముపించాము అనుకుంటున్నారు...

కానీ అభిమానుల్లో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి...
వీడియోలో ఉండే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ నీ టూన్ ఎందుకు చేశారు అంటున్నా ఫ్యాన్స్...
వీడియో ఎందుకు ఈ రెండు రోజుల పోస్ట్ చేయలేదు అంటున్నా ఫ్యాన్స్.. pic.twitter.com/R0bDxPuiod

— South Digital Media (@SDM_official1)
click me!