మహేష్ బాబు ఓ బండరాయి.. ముఖంలో ఎక్స్ ప్రెషన్సే ఉండవు.. స్టాండప్ కమెడియన్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Sep 14, 2018, 12:08 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఓ స్టేజ్ షోలో కామెడీ చేసి వార్తల్లో నిలిచాడు స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్. పెద్దగా పాపులారిటీ లేని ఈ స్టాండప్ కమెడియన్ సూపర్ స్టార్ పై జోక్స్ వేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఓ స్టేజ్ షోలో కామెడీ చేసి వార్తల్లో నిలిచాడు స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్. పెద్దగా పాపులారిటీ లేని ఈ స్టాండప్ కమెడియన్ సూపర్ స్టార్ పై జోక్స్ వేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. మహేష్ బాబుని టాపిక్ గా తీసుకొని అతడిపై కామెడీ చేసే ప్రయత్నంలో మనోజ్ హద్దులు మీరు ప్రవర్తించాడు. మహేష్ కి ఎక్స్ ప్రెషన్స్ పలకడం రాదని.. కత్రినా కైఫ్ లానే ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించవని మహేష్ బాబు.. కత్రినా కైఫ్ కి మేల్ వెర్షన్ అని అన్నాడు.

హైదరాబాద్ లో ఉండే రాక్స్(బండరాళ్లు)లా మహేష్ బాబు ఎక్స్ ప్రెషన్స్ ఉంటాయని అందుకే అందరూ మహేష్ బాబు రాక్స్ అంటుంటారని అన్నాడు. అంతటితో ఆగలేదు... స్పైడర్ సినిమాలో ఎస్.జె.సూర్య తన నటనతో మెప్పిస్తుంటుంటే మహేష్ బాబు మాత్రం నటించడం రాక అలా నిలబడి ఉన్నాడని కామెంట్స్ చేశాడు.

తమిళంలో మహేష్ ఒక సినిమాలోనే నటించాడని.. తెలుగులో ఆగడు, ఒక్కడు, సైనికుడు ఇలా చాలా సినిమాల్లో నటించాడని తెలుగు దర్శకులు కూడా ఎక్స్ ప్రెషన్స్ కుడు కుడు(ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వు) అని బతిమాలుకున్నారని అన్నాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ వెర్రివాళ్లని అర్ధం వచ్చే విధంగా అతడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

ఈ వీడియో చూసిన మహేష్ ఫాన్స్ మనోజ్ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. మహేష్ బాబుపై కామెడీ చేసినట్లు తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల గురించి చేసే ధైర్యం చేయగలవా అంటూ అతడికి ఛాలెంజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మనోజ్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదం ఎప్పటికి సద్దుమునుగుతుందో చూడాలి!

 

click me!