
సినిమా ఇండస్ట్రీలో తను కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు. 'మీటూ' ఉద్యమం ఉధృతమవుతున్న నేపధ్యంలో సైఫ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పాతికేళ్ల క్రితం తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని అయితే అవి లైంగిక పరమైనవి కావని సైఫ్ అన్నారు.
అయితే ఇప్పటికి కూడా తను ఎదుర్కొన్న వేధింపులు గుర్తొస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుంటుందని అన్నారు. ఈ సొసైటీలో చాలా మంది ఇతరులను అర్ధం చేసుకోలేరని, అలాంటి వ్యక్తులకు వేరే వాళ్ల బాధలను అర్ధం చేసుకోవడం రాదని అన్నారు.
''నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అంత ముఖ్యమైన వ్యక్తిని కాను.. ఇక నుండి మనం మహిళలను జాగ్రత్తగా చూసుకోవాలి. కేసు పాతవే కావొచ్చు కానీ నిందితులకు శిక్ష పడాలి.
చిత్ర పరిశ్రమలో ఏం జరిగినా అది మన మంచికే.. నా ముందు ఎవరైనా.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తే ఊరుకోను. ఇప్పటివరకు మీటూ ఉద్యమంలో భాగంగా ఎవరి పేర్లయితే బయటపడ్డాయో వారితో ఇకపై కలిసి పని చేయను'' అంటూ చెప్పుకొచ్చాడు సైఫ్ అలీఖాన్.
ఇవి కూడా చదవండి..
మీటూ ఎఫెక్ట్: సినిమాలు క్యాన్సిల్.. స్టార్ హీరోల షాకింగ్ నిర్ణయాలు!
దగ్గరకి లాక్కొని కౌగిలించుకొని.. డైరెక్టర్ పై నటి సంచలన కామెంట్స్!
బడా డైరెక్టర్ పై అత్యాచారం ఆరోపణలు!