లీగల్ గా ప్రొసీడ్ అవుతా.. గీతామాధురి వార్నింగ్!

Published : Oct 15, 2018, 10:36 AM IST
లీగల్ గా ప్రొసీడ్ అవుతా.. గీతామాధురి వార్నింగ్!

సారాంశం

సినీ సంగీత ప్రపంచంలో గీతామాధురి పేరు సుపరిచితమే.. టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ షోలో రన్నరప్ గా నిలిచి మరింత పేరు సంపాదించింది. అయితే షోలో ఆమె ఉన్న సమయంలో చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు.

హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఆమెపై ట్రోల్స్ ఆగలేదు. ఇది ఇలా ఉండగా.. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆమెపై కొత్త వార్తలను పుట్టిస్తూ కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన గీతామాధురి వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

తప్పుడు వార్తలు ఎలా ప్రెజంట్ చేస్తారంటూ మండి పడింది. ఫేక్ వీడియోలు, తప్పుడు వార్తలు పెడుతున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లను టార్గెట్ చేస్తూ.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది.

అయితే లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి కొంచెం ముందు ఆ వీడియోలు తీసేయడానికి సదరు యూట్యూబ్ ఛానళ్ల వారికి కొంతం సమయం ఇస్తున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రాసుకొచ్చింది. మహా అయితే ఒకరోజు బాధపడతానని తరువాత సంతోషం, ప్రశాంతత నాదేనంటూ కొన్ని పోస్ట్ లు పెట్టింది!

ఇవి కూడా చదవండి.. 

గీతామాధురికి హీరోయిన్ ఛాన్స్..!

ఆ బాండింగ్ ఏంటో మాకు తెలుసు: గీతామాధురి

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌