జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డ్... తెలుగు సినిమాకు మాత్రం కాదు..

By Mahesh Jujjuri  |  First Published Aug 16, 2024, 2:24 PM IST

కొరియోగ్రాఫర్ గా అద్భుతం సాధించాడు టాలీవుడ్ స్టార్ డాన్సర్ జానీ మాస్టర్. తాజాగా జానీమాస్టర్ పేరును అనౌన్స్ చేశారు.


70వ ఆతీయ అవార్డ్ లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అవార్డ్ ల విషయంలో టాలీవుడ్ కు అన్యాయం జరిగింది. తెలుగు నుంచి రెండే రేండు అవార్డ్స్ రాగా.. తమిళంలో పొన్నియన్ సెల్వన్, కన్నడలో కెజిఎఫ్ కు అవార్డ్ ల పంట పండిండి ఇక మిగిలిన అవార్స్ అన్నీ ఉత్తరాదివారికే కట్టబెట్టడం టాలీవుడ్ కు పెద్ద షాక్ అని చెప్పాలి. 

కాగా టాలీవుడ్ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిఖిల్ నటించిన కార్తీకేయా 2ను నేషనల్ అవార్డ్ వరించగా.. బెస్ట్ కొరియో గ్రాఫర్ కేటగిరీలో జానీ మాస్టర్ ను జాతీయ అవార్డ్ వరించింది. అయితే ఈ అవార్డ్ ను సతీష్ కృష్ణన్ తో కలిపి కంబైయింట్ గా ప్రకటించారు. అది కూడా జానీ మాస్టర్ కు ఈ అవార్డ్ తెలుగు సినిమాకు రాలేదు. ధనుష్ నటించిన తిరుచిత్రంబలం తెలుగులో తిరుగా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు గాను జాతీయ అవార్డ్ వరించింది. 

Latest Videos

ఇక తమిళ,మలయాళ, కన్నడ సినిమాలకు నేషనల్ అవార్డ్ ల పంటపండింది..ఇక ఎప్పటిలాగానే బాలీవుడ్ కు ఎక్కువ అవార్డ్ లను కట్టబెట్టారు. ఈసారి తెలుగు సినిమాకు ఈ విషయంలో అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఏదో ప్రాంతీయ చిత్రానికి ఇవ్వాలి కనుకు ఇచ్చారు. ఇక ఈవిషయంలో సినిమా పెద్దల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో చూడాలి. మొత్తానికి కొరియోగ్రఫీ క్యాటగిరీలో జాతీయ అవార్డ్ సాధిచి ఒక మెట్టు ఎక్కారు జానీమాస్టార్. 

 

 

click me!