శింబుకి నిరాశే.. తేజు ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్, గీతా ఆర్ట్స్ చేతుల్లోకి 'మానాడు'?

pratap reddy   | Asianet News
Published : Dec 06, 2021, 05:23 PM IST
శింబుకి నిరాశే.. తేజు ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్, గీతా ఆర్ట్స్ చేతుల్లోకి 'మానాడు'?

సారాంశం

తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోSimbu. శింబు నటించిన చిత్రాలు విడుదలవుతుంటే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. అంతటి క్రేజ్ శింబు సొంతం.

తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోSimbu. శింబు నటించిన చిత్రాలు విడుదలవుతుంటే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. అంతటి క్రేజ్ శింబు సొంతం. ఇక శింబు చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. వివాదాల నడుమ, ఉత్కంఠ భరిత పరిస్థితుల్లో ఇటీవల మానాడు చిత్రం తమిళంలో విడుదలయింది. 

ప్రస్తుతం Maanaadu చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది ఈ చిత్రం. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని లూప్ నేపథ్యంలో తెరకెక్కించాడు. టైం లూప్ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్ ఈ చిత్రం. ప్రేక్షకులని రంజింపజేస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. 

ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయాలని భావించారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని భావించింది. తెలుగు రిలీజ్ కి అంతా రెడీ చేసుకుని తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రానికి The Loop అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ప్రచారం కూడా మొదలయింది. కానీ కొన్ని సమస్యల వల్ల చివరి నిమిషంలో ఈ చిత్ర తెలుగు రిలీజ్ ఆగిపోయింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలనీ శింబు ఎంతో ప్రయత్నించాడు. బలమైన కథ కథనం ఉండడంతో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని శింబు భావించాడు. దీనితో తెలుగులో టీనా మార్కెట్ కూడా పెరుగుతుందని అనుకున్నాడు. కానీ అది జరగలేదు. 

ప్రస్తుతం పరిస్థితులు ఊహించని విధంగా టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ రిలీజ్ కాకుండా రీమేక్ చేయాలనే డిమాండ్ నెలకొందట. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు రీమేక్ హక్కుల కోసం ఎగబడుతున్నాయి. అందులో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఉంది. గీతా ఆర్ట్స్ రీమేక్ రైట్స్ డీల్ ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. 

రీమేక్ లో హీరోగా సాయిధరమ్ తేజ్ ని అనుకుంటున్నట్లు టాక్. తేజు బాడీ లాంగ్వేజ్ కి ఈ చిత్రం సెట్ అవుతుందని భావిస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మానాడు రీమేక్ నిర్మించేందుకు బన్నీ వాసు ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ అన్వేషణలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Unstoppable With NBK: ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై హాట్ కామెంట్స్.. బోయపాటి ముందే బాలయ్య కంటతడి

Also Read: RRR Movie: సిక్స్ ప్యాక్‌లో రామ్‌చరణ్‌ నెవర్‌ బిఫోర్‌ లుక్‌.. ఈ రేంజ్‌లో ఉంటే ఫ్యాన్స్ కి పండగే

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?