సక్సెస్ లేదని అందరూ నన్ను వదిలేశారు.. మెగాహీరో కామెంట్స్!

Published : Apr 08, 2019, 11:21 AM IST
సక్సెస్ లేదని అందరూ నన్ను వదిలేశారు.. మెగాహీరో కామెంట్స్!

సారాంశం

మెగాహీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా తన పేరుని మార్చుకున్నాడు. తన కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా టైటిల్స్ లో ఇదే పేరు రానుంది. 

మెగాహీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా తన పేరుని మార్చుకున్నాడు. తన కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా టైటిల్స్ లో ఇదే పేరు రానుంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తాజాగా సాయి తేజ్ వెల్లడించాడు.

ఐదుగురు విభిన్న వ్యక్తులు హీరోని ఎలా ప్రభావితం చేశారనేదే ఈ సినిమా కథ అని చెప్పుకొచ్చాడు. అలానే తనకు వరుసగా వచ్చిన ఆరు ఫ్లాప్ లపై కూడా స్పందించాడు. అరడజను ఫ్లాప్ లు వచ్చిన తరువాత తనవాళ్లు ఎవరో తెలుసుకున్నానని.. గుండె ధైర్యం కూడా బాగా పెరిగిందని అంటున్నాడు.

చాలా మంది సక్సెస్ ఉన్నప్పుడు వస్తారని, సక్సెస్ లేనప్పుడు వెళ్లిపోతారని.. కొందరు మాత్రమే సక్సెస్ తో సంబంధం లేకుండా ఉంటారని.. ఆరు సినిమాల ఫ్లాప్ లతో వాళ్లను పొందగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తనవైపు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని.. షూటింగ్ చెప్పాలంటే ఒకరిద్దరు మాత్రమే మిగిలారని.. అందరూ తనను వదిలేశారని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఫ్లాప్ ల నుండి చాలా నేర్చుకున్నానని.. సినిమాలో తన పాత్ర నిజజీవితానికి దగ్గరగా ఉంటుందని చెప్పాడు. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా.. బాధను మనసులో దాచుకొని బయటకి నవ్వడం అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌