
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ఎండల్లో తిరుగుతున్నారు. నెలరోజులు ప్రచారం కోసం తిరిగారో లేదో డీ హైడ్రేషన్ వచ్చేసింది. దీంతో ప్రస్తుతం పవన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఇప్పటికే నటుడు రామ్ చరణ్ విజయవాడకి వెళ్లి బాబాయ్ పవన్ కళ్యాణ్ ని పరామర్శించి జనసేనకి తన మద్దతు తెలిపారు. ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది. ఈరోజు బన్నీ పుట్టినరోజు కావడంతో రేపు ఉదయాన్నే రాజమండ్రి వెళ్లి.. అక్కడ నుండి పాలకొల్లు వెళ్తారు.
అక్కడ పవన్ ని కలిసి, జనసేన పార్టీకి మద్దతు తెలియజేసి వస్తారు. సమయం ఉంటే నాగబాబుని కూడా కలిసి వస్తారని సమాచారం. ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.
ఇప్పుడు మెగాహీరోలు లైన్ లోకి వస్తే.. ఓటర్లను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మెగాహీరోలు గోదావారికి వెళ్తున్నారు.