'గాలోడు'గా సుడిగాలి సుధీర్... లుక్ మాస్ హీరో రేంజ్ లో!

Published : May 19, 2021, 12:52 PM IST
'గాలోడు'గా సుడిగాలి సుధీర్... లుక్ మాస్ హీరో రేంజ్ లో!

సారాంశం

రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో గాలోడు అనే టైటిల్ తో సుధీర్ ఓ మూవీ చేస్తున్నారు. నోట్లో సిగరెట్, చివికి పోగు, మాసిన గడ్డంతో సుధీర్ లుక్ మాస్ హీరో రేంజ్ లో ఉంది.


బుల్లితెర సెలెబ్రిటీలలో సుడిగాలి సుధీర్ క్రేజ్ వేరు. జబర్దస్త్ కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న సుధీర్ అనేక టెలివిజన్ కార్యక్రమాలలో యాంకర్ చేసి ఫుల్ పాప్యులర్ అయ్యారు. ముఖ్యంగా డాన్స్ రియాలిటీ షో ఢీ సుధీర్ ని స్టార్ ని చేసింది. ఆ షోలో కామెడీతో పాటు సింగింగ్, డాన్స్, మ్యాజిక్ వంటి తన మల్టీ టాలెంట్స్ చూపిస్తూ సుధీర్ హీరో రేంజ్ ఫాలోయింగ్ సంపాదించారు. 

బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో సుధీర్  హీరోగా మారిన సంగతి తెలిసిందే. సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ సుధీర్ హీరోగా విడుదలైన చిత్రాలు. 3 మంకీస్ మూవీలో తన టీమ్ మేట్స్ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను నటించడం జరిగింది. కాగా నేడు సుధీర్ బర్త్ డే పురస్కరించుకొని మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ పై ప్రకటన చేశారు. 


రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో గాలోడు అనే టైటిల్ తో సుధీర్ ఓ మూవీ చేస్తున్నారు. నోట్లో సిగరెట్, చివికి పోగు, మాసిన గడ్డంతో సుధీర్ లుక్ మాస్ హీరో రేంజ్ లో ఉంది. గాలోడు మూవీలో సుధీర్ రోల్ ఆసక్తికరంగా ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. అలాగే కాలింగ్ సహస్త్ర అనే మరో చిత్రంలో సుధీర్ హీరోగా నటిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌