సాయి పల్లవి పెళ్ళి ఎప్పుడు.. అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే సాయి పల్లవి పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా సాయి పల్లవికి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
సహజ సుందరి సౌత్ ఇండియన్ స్టార్ నటి సాయి పల్లవి. అందరు హీరోయిన్లలా కాదు సాయిపల్లవి. ముఖానికి పెయింట్, పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని, పొట్టి డ్రస్సులు వేసుకోవడం ఆమెకు అలవాటు లేదు. చాలాసింపుల్ గా ఉంటుంది హీరోయిన్. మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు.. అవసరం అయితే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకు అలవాటు లేదు.
పాత్రలకు ఇంపార్టెన్స ఉంటేనే చేస్తుంది సాయి పల్లవి. మరీముఖ్యంగా హీరో నామినేషన్ ఉన్న సినిమాలు చేయడం ఆమకు ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు.. సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా.. కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే సాయిపల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది.
అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో చేస్తోంది. ఈసినిమాలో ఆమె సీనత పాత్రలో కనిపించబోతోంది. ఇక సీత పాత్ర అయితే చేస్తోంది కాని.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుంది అని అంతా అడుగుతున్నారు. అయితే సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని ఆమెను టార్చర్ చేశారట.. కాని ఎవరు ఆమెను పెల్లి చేసుకోమని టార్చర్ చేసింది.
సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయట పెట్టింది. తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అందరికి పెళ్లి అయిపోవడం , సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవడం వల్ల కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట.
దీంతో సాయి పల్లవి షాక్ అయిపోయిందట. ఇంకా నా కెరియర్ లో నేను అనుకున్నది ఏ మాత్రం సాధించలేదు. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అలా కరోనా పీరియడ్ అయిపోయే వరకు ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాల బిజీ వల్ల తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించేవరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లితండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.