విలాసవంతమైన ఇల్లు అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్.. పెళ్ళైన కొన్ని రోజులకే ఇలా, ఏం జరిగింది ?

By tirumala AN  |  First Published Aug 22, 2024, 3:09 PM IST

సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సోనాక్షి సిన్హా. గ్లామర్, నటన పరంగా చాలా మంది అభిమానులని సొంతం చేసుకుంది. సోనాక్షి సిన్హా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా రాణించింది.


సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సోనాక్షి సిన్హా. గ్లామర్, నటన పరంగా చాలా మంది అభిమానులని సొంతం చేసుకుంది. సోనాక్షి సిన్హా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా రాణించింది. జూన్ లో సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ని ప్రేమ వివాహం చేసుకుంది. 

కొద్దిమంది బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సోనాక్షి వివాహ వేడుక జరిగింది. అయితే సోనాక్షి ప్రేమ వివాహం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదంటూ వార్తలు వచ్చాయి. ఆమె వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

Latest Videos

ముంబైలోని జుహు ప్రాంతంలో సోనాక్షికి విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. అక్కడే ఆమె వివాహ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. సోనాక్షి వివాహం జరిగి రెండు నెలలు కూడా కాలేదు. అపుడే సోనాక్షి తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తూ సోనాక్షి ఈ ఇంటిని అమ్మేస్తోందట. లగ్జరీ హౌస్, పైగా బీచ్ కి ఎదురుగా సీ ఫేసింగ్ కావడంతో సోనాక్షి బాంబు లాంటి ధర చెబుతోందట. అయితే పెళ్ళైన కొద్దిరోజులకే సోనాక్షి ఎందుకు అమ్మేస్తోంది ? ఏం జరిగింది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే బాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు సోనాక్షి, జహీర్ దంపతులు బాంద్రా లోని మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారట. అందుకే సోనాక్షి జుహులోని ఇంటిని అమ్మేయాలని చూస్తోంది. 

click me!