ప్రభాస్‌-హను మూవీ హీరోయిన్ ఇమాన్వీ కి షాకింగ్ రెమ్యునేషన్ ?

By Surya Prakash  |  First Published Aug 22, 2024, 2:38 PM IST

ప్రభాస్ హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో (PrabhasHanu) ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 



ప్రభాస్ ..యమా జోరు మీద ఉన్నారు.  ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర విజయాలతో  దూసుకుపోతన్నారు. ఈ క్రమంలో  ప్రభాస్ హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో (PrabhasHanu) ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్‌ (Iman esmail) నటిస్తోంది. 

ప్రబాస్ సినిమాలో చేయాలని చాలా మందికి ఉంటుంది. కొందరికే ఆ అవకాసం వస్తుంది. అలా తాజాగా  ఇమాన్వీ  అనే అమ్మాయికి ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.  ఈ క్రమంలో అసలు ఎవరు ఈమె అనే విషయం తో పాటు ఆమెకు ఎంత ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

Latest Videos

అందుతున్న సమాచారం మేరకు ఆమెకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ గా అందచేస్తున్నారు. అమెకు ఆల్రెడి యూట్యూబ్ నుంచి నెలకు రెండు లక్షల ఆదాయం ఉంది. అందుకే ఆమె కొత్త అయినా కోటి రూపాయలు దాకా ఇస్తున్నారని చెప్తున్నారు. దానికి తోడు ప్రభాస్ సినిమా అనగానే అన్ని భారిగానే ఉంటాయి. ఆమె మాత్రం ప్రభాస్ సినిమాలో నటించే ఆఫర్ రావటమే పెద్ద రెమ్యునరేషన్ అంటోంది. ఇక మల్లీశ్వరి చిత్రానికి అప్పట్లో కత్రినాకైఫ్ కు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు. మళ్లీ ఇంతకాలానికి ఆ రేంజిలో తెలుగులో రెమ్యునేషన్ తీసుకుంటున్న కొత్త హీరోయిన్ ఈమే. 

ఇక ఆమెకు ఇనిస్ట్రాగ్రమ్ లో ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. 863,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె సోషల్ మీడియా క్వీన్ గా అభివర్ణిస్తూంటారు ఆమె అభిమానులు.  ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలో అవుతున్న వాళ్లకు ఇమాన్వీ రీల్స్‌ కొత్తేమీ కాదు. తన డ్యాన్స్‌, స్టైల్‌తో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వీ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా  వేదికగా ఇమాన్వీ పేరు ట్రెండ్‌ అవుతోంది.

భాష తెలియకపోయినా ఆ పాటకు తనదైన స్టెప్‌లు జోడించి రీక్రియేట్‌ చేస్తుంది. రీల్స్‌ చేసేటప్పుడు, ఇతర షోలకు ప్రదర్శన ఇచ్చేటప్పుడు కచ్చితంగా వర్క్‌ షాప్‌ నిర్వహిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యే పాటలను ఎంపిక చేయడంతో పాటు, రీల్‌ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? అందుకు కాస్ట్యూమ్స్‌ ఏంటి? ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతుంది. ఇన్‌స్టాలో తనతో పోటీపడుతున్న ఇషాన్‌ పటేల్‌ లాంటి వారి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటానని అంటోంది. 

click me!