సాయిపల్లవి తన చెల్లి ఎంగేజ్ మెంట్ కు వేసిన స్టెప్పులు నెట్టింట దుమ్ములేపుతున్నాయి. వెండితెరపై కంటే నార్మల్ గా మాస్ స్పెప్పులతో మడతెట్టేసింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు ప్రేక్షకుల్లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి Sai Pallavi ఎంతో మంచి పేరు దక్కించుకున్నారు. ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లోనూ తనదైన శైలిని ప్రదర్శిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సాయిపల్లవి ఎంత ఎనర్జిటిక్ గా ఉంటారో తెలిసిందే. తను ఎక్కడ ఉన్నా అక్కడంతా సందడి వాతావరణం ఉండటం సర్వసాధారణం. అలాంటి తన చెల్లి పెళ్లి చేసుకోబోతుందంటే తన హవా ఇంకెలా ఉంటుంది.
ప్రస్తుతం సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి నెకొన్న విషయం తెలిసిందే. తన చెల్లి పూజా కన్నన్ Pooja Kannan ఇటీవలనే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి, రీసెంట్ గానే నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రియుడు వినీత్ తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్న చెల్లి పూజాను చూసి సాయిపల్లవి సంతోషించింది. తన పెళ్లిని వాయిదా వేసుకున్న స్టార్ హీరోయిన్ చెల్లి పెళ్లిని మాత్రం దగ్గరుండి మరీ జరిపిస్తోంది.
undefined
ఇక తాజాగా సోషల్ మీడియాలో సాయిపల్లవి, చెల్లి పూజా కన్నన్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. సాయి పల్లవి తన చెల్లి నిశ్చితార్థపు వేడుకలో వేసిన డాన్స్ కు అంతా ఫిదా అవుతున్నారు. తాజాగా అక్కా చెల్లెళ్లు కలిసి వేసిన మాస్ స్టెప్పులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సాయిపల్లవి తీన్మార్ స్టెప్పులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మస్తు ఖుషీ అవుతున్నారు. లైక్ తో ఆ వీడియోను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ వీడియోలో సాయి పల్లవి, తన చెల్లి పూజా, తనకు కాబోయే భర్త వినీత్, బంధుమిత్రులు ఉన్నారు. అంతా కలిసి హుషారుగా డాన్స్ వేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రం గ్రాండ్ గా జరిగింది. ఇక నెక్ట్స్ పెళ్లి డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సాయిపల్లవి మాత్రం తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టారు. నాగ చైతన్య సరసన ‘తండేల్’ Thandel అనే మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ నితేష్ కుమార్ దర్శకత్వంలో రానున్న ‘రామయణం’ సీతగా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మున్ముందు క్లారిటీ రానుంది.
When the Whole Family is in Dancing Mood Especially Our Queen 🥹❤️🔥 pic.twitter.com/17aUqL2owQ
— SaiPallavi.Fangirl07™ (@SaiPallavi_FG07)