బాలీవుడ్ కంటే సౌత్ సినిమా గొప్పేమీ కాదు- అమితాబ్ 

By Sambi ReddyFirst Published Jan 28, 2024, 5:54 PM IST
Highlights

ఇండియన్ సినిమాపై సౌత్ చిత్రాల ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ పని అయిపోయిందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై బిగ్ బీ అమితాబ్ స్పందించారు. కీలక కామెంట్స్ చేశారు.


ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే. బాహుబలి సిరీస్ అనంతరం సౌత్ చిత్రాల హవా పెరిగింది. కంటెంట్ ఉంటే భాషాబేధం లేకుండా చిత్రాలను జనాలు ఆదరిస్తారని రుజువైంది. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలైన కెజిఎఫ్, సాహో,  పుష్ప, కెజిఎఫ్ 2, కాంతార, కార్తికేయ 2, హనుమాన్ చిత్రాలు బాలీవుడ్ లో సత్తా చాటాయి. హిందీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోల చిత్రాలకు కనీస ఆదరణ దక్కడం లేదు. సౌత్ చిత్రాలు మాత్రం వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. 

ఈ క్రమంలో బాలీవుడ్ పని అయిపోయింది, సౌత్ ఇండియా చిత్రాలు డామినేట్ చేస్తున్నాయనే వాదన మొదలైంది. ఈ అభిప్రాయాన్ని లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఖండించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ మాట్లాడుతూ.. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయని కొందరు అంటున్నారు. నిజానికి ప్రకృతిలో, ప్రపంచంలో, దైనందిన జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటనల సినిమాలకు కథలుగా, స్ఫూర్తి నిలుస్తున్నాయి. 

Latest Videos

ఈ మధ్య ప్రాంతీయ భాషా చిత్రాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. ఆ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అద్భుతమని ప్రేక్షకులు భావిస్తున్నారు. మీ సినిమా చాలా బాగుందని సౌత్ వారికి చెబితే... బాలీవుడ్ చిత్రాలే తాము తెరకెక్కిస్తున్నాము అన్నారు. దీవార్, శక్తి, షోలే వంటి చిత్రాల నుండి స్ఫూర్తి పొందుతున్నామని అన్నారు. కాకపోతే మలయాళ, తమిళ సినిమాలు వాటికవే ప్రత్యేకం. అలాగని బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీ గొప్పని చెప్పడం సరికాదు.. అని అన్నారు. 

అమితాబ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో అమితాబ్ నటించారు. ప్రస్తుతం నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2829 AD మూవీలో అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు. కల్కి మే 9న విడుదల కానుంది. 

click me!