
టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. ఏక కాలంలో పది చిత్రాల వరకు సైన్ చేసింది. అయితే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా ఆమె క్రిందకు పడిపోయారు. శ్రీలీల కిస్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. పెళ్ళిసందడి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే శ్రీలీల ఎనర్జీకి జనాలు కనెక్ట్ అయ్యారు. శ్రీలీల డాన్సులు దుమ్మురేపింది.
దాంతో ఏకంగా రవితేజ పక్కన ఛాన్స్ కొట్టేసింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకా మంచి విజయం సాధించింది. ఆ మూవీలో సాంగ్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. శ్రీలీల ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అరడజనుకు పైగా చిత్రాలకు శ్రీలీల సైన్ చేసింది. శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి.
వీటిలో భగవంత్ కేసరి మాత్రమే హిట్. ఈ మూవీలో శ్రీలీల బాలకృష్ణకు కూతురు వరసయ్యే అమ్మాయి పాత్ర చేసింది. కమర్షియల్ యాంగిల్ ఉన్న పాత్ర కాదు. ఇక గుంటూరు కారం మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అనూహ్యంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే మూవీ క్లీన్ హిట్ అని చెప్పలేము.
అందులోనూ శ్రీలీల పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. గుంటూరు కారం శ్రీలీల కెరీర్ కి ఏమంత బూస్ట్ ఇవ్వలేకపోయింది. ఇక అధికారికంగా శ్రీలీల చేస్తున్న మరో బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఏపీలో ఎన్నికలు అయ్యాక మూవీ చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం కలదు.
దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెట్టి రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ ప్రకటించాడు. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేం. మొత్తంగా శ్రీలీల కెరీర్ ప్రమాదంలో పడింది. పరిశ్రమను ఏలేస్తుంది అనుకుంటే... అనూహ్యంగా చతికిల పడింది. సబ్జక్ట్స్ ఎంపికలో శ్రీలీల తడబడింది.