సాయి పల్లవికి సినిమా సెట్ లో సన్మానం.. కారణం ఎంటో తెలుసా..?

Published : Jul 17, 2024, 05:56 PM IST
సాయి పల్లవికి సినిమా సెట్ లో సన్మానం.. కారణం ఎంటో తెలుసా..?

సారాంశం

చాలా కాలం అయ్యింది సాయి పల్లవి స్క్రీన్ మీద సరిగ్గా కనపడి. సాలిడ్ సినిమా చేయనేలేదు చాలా కాలంగా..? ఇక తాజాగా తండేల్ సినిమాతో రాబోతోంది బ్యూటీ.. ఈక్రమంలో సాయి పల్లవికి సెట్ లో సన్మానం జరిగింది కారణం ఏంటో తెలుసా..? 

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది. సాయి పల్లవి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ..  స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఎక్స్ పోజింగ్ కు.. బోల్డ్ గెటప్ లకు దూరంగా ఉండే సాయి పల్లవి.. పద్దతిగల సినిమాలు చేస్తూనే.. ఈ స్తాయి సాధించింది.  ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్‌ ది లీడింగ్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది సాయిపల్లవి. 

ఫస్ట్ మూవీ ప్రేమమ్ తో అందరిమనసులు గెలిచిన సాయి పల్లవి.  తెలుగులో ఫిదా సినిమాతో ఆడియిన్స్ ను ఫిదా చేసింది.ఆతరువాత, శ్యామ్‌సింగరాయ్‌, లవ్‌స్టోరీ లాంటి మూవీస్ తోఅందరి మనసు దోచుకుంది బ్యూటీ. ఇక గతంలో సినిమాలు ఎన్నో అవార్డ్స్ అందుకుంది సాయి పల్లవి. తాజాగా ఆమె మరోసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను సాధించింది. ఈరకంగా ఆమె అరుదైన రికార్డ్ ను కూడా క్రియేట్ చేసింది. 

జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్ నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్‌ తండేల్‌ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాడు. సాయిపల్లవి సత్య పాత్రలో కనిపించనుంది.

 

బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో అందర్నీ వెనక్కినెట్టి మరో ఫిల్మ్‌ఫేర్‌కు ఎంపికైంది. సిందే. 2022 సంవత్సరానికిగాను విరాటపర్వం, గార్గి సినిమాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ని అందుకోనున్నది సాయి పల్లవి.ఈ సందర్భంగా సాయిపల్లవికి అభినందనలు తెలియజేస్తూ.. ఇండస్ట్రీ  నుంచి సెలబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఆమెకు సన్మానం కూడా చేశారు. తండేల్ సినిమా సెట్ లో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ  కేక్‌ కట్‌ చేయించారు స్టార్ ప్రొడ్యూసర్  అల్లు అరవింద్‌. ఈ కార్యక్రమంలో తండేల్ మూవీ డైరెక్టర్ చందు మోండేటీ కూడా పాల్గొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 లో ముద్దుల గోల , డార్క్ రూమ్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్