నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే.. యానిమల్ నటుడు సంచలన కామెంట్స్..?

By Mahesh JujjuriFirst Published Jul 17, 2024, 5:48 PM IST
Highlights

క్యాస్టింగ్ కౌచ్.. ఫిల్మ్ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాలలో కూడా ఆడవారిని ఇబ్బందిపెడుతున్నసమస్య. ఈ విషయంలో ఈమధ్యనే ఓపెన్ అవుతున్నారు తారలు. చిత్రం ఏంటంటే.. బాధితుల్లో మగవారు కూడా ఉండటం. 

క్యాస్టింగ్ కౌచ్.. ఫిల్మ్ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాలలో కూడా ఆడవారిని ఇబ్బందిపెడుతున్నసమస్య. ఈ విషయంలో ఈమధ్యనే ఓపెన్ అవుతున్నారు తారలు. గతంలో భయపడి కామెంట్లు చేసేవారు కాదు. కాని మీ టు ఉద్యమం తరువాత చాలామంది తారలు తాము ఫేస్ చేసినవి అందరితె శేర్ చేసుకుంటున్నారు. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంది హీరోయిన్స్ ఇప్పటి వరకూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. 

చిన్న హీరోయిన్లు.. జూనియర్ ఆర్టిస్ట్ లే కాదు... స్టార్ హీరోయిన్స్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులే. అంతే కాదు ఇందులో మగవారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. చాలా మంది మగవారు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులుగా ఉన్నారంటే.. ఎవరికి తెలియకుండా లోపల ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది.

Latest Videos

All So Read: బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?

చాలామంది నటీ నటులు ఇప్పటికే తాము ఎప్పుడో ఒకప్పుడు, ఎన్నడో ఒకనాడు క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైనట్లు చెప్పుకోస్తున్నారు. ఇందుకు సంబంధించి 'మీ టూ' అనే పెద్ద ఉద్యమమే జరిగింది. అయితే తాజాగా ఇలాంటి అంశమే మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైన వార్తలు ఆడవారు ఎక్కువగా బయటకు వస్తూ ఉన్నారు. కాని తాజాగా ఓ నటుడు తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించాడు. 

ఇంతకీ అతను ఎవరో కాదు.. సిద్ధాంత్‌ కర్నిక్‌.. యానిమల్ సినిమాలో  ఇంపార్టెంట్ రోల్ పోసించిన యాక్టర్. తాజాగా యానిమల్‌ నటుడు కూడా తాను క్యాస్టింగ్‌ కౌచ్‌కు గురైనట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు.  సిద్ధాంత్‌ కర్నిక్‌ బాలీవుడ్‌ లో ఫేమస్ నటుడు.  బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న నటుడిగా, పలు హిట్‌ సినిమాల్లో తన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు సిద్ధాంత్ కర్నిక్. 2023లో సందీప్‌రెడ్డి వంగా నిర్మించిన 'యానిమల్' సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు. 

All So Read: రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

అంతే కాదు యానిమల్ కంటే ముందు అతను ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు సిద్ధాంత్ కర్నిక్. సిద్ధాంత్ 2004లో టీవీ షో రీమిక్స్ తో తన కెరీర్ ప్రారంభించాడు. ఫేమస్ వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2’లో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ '2005 సంవంత్సరంలో ఇండస్ట్రీకి రావాలని గట్టిగా ప్రయత్నం చేశాను అన్నారు. 

అలా  ప్రయత్నిస్తున్న టైమ్ లోనే ఓ సినిమాలో ఆఫర్‌ కోసం కో-ఆర్డినేటర్‌ను కలిశాను. అతను నా ప్రొఫైల్‌ తీసుకొని రాత్రి 10.30 గంటలకు రావాలని అన్నాడు.  నాకు అప్పుడే అనుమానం వచ్చింది, రాత్రి 10 గంటల సమయంలో ఎందుకు రావాలి అని అనుకున్నాను. కానీ ఆఫర్‌  మిస్ అవ్వకూడదు కదా అని అతను చెప్పినట్టు ఆ సమయానికి వెళ్లాను. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం అర్ధం అయ్యింది అన్నారు సిద్థాంత్. 

All So Read:  అమ్మ శ్రీదేవి చివరి కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్.. అతిలోక సుందరి చివరి కోరిక ఏంటంటే..?

అతను చాలా మంచిగా మాట్లాడుతూనే.. అవకాశాలు దక్కాలంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి లేదంటే అవకాశాలు రావని.. చెప్తూ నా దగ్గరికి వచ్చి ఏదేదో చేయబోయాడు..  దీంతో అతని నుంచి తప్పించుకుని నాకు ఇలాంటివి ఇష్టం లేదని, అవకాశాలు రాకున్నా పర్వాలేదని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను' అని సిద్ధాంత్‌ కర్నిక్ చెప్పాడు. ప్రస్తుతం ఈ నటుడు వ్యాక్యలు వైరల్ అవుతున్నాయి. 

జూనియర్ ఎన్టీఆర్ ప్రభంజనం తట్టుకుని నిలబడ్డ వెంకటేష్ సినిమా ఏదో తెలుసా..?

click me!