
ప్రస్తుతం థియేటర్‌లో ‘కల్కి’ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ (Prabhas)హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (kalki 2898 ad) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాల క్లబ్‌లో చేరింది. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ‘భారతీయుడు2’ పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో థియేటర్‌లో సినిమా చూడాలనుకునే వారికి ‘కల్కి’ఏకైక ఆప్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ లో ఇప్పటికీ అనేక థియేటర్లో ‘కల్కి’ దుమ్ము దులుపుతున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఈ సినిమా క్రెడిట్ ఎవరికి చెందుతుందనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. ప్రభాస్ కా లేక నాగ్ అశ్విన్ కా లేక వాళ్లు ఎంచుకున్న కథకా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలై ఇప్పుడు వెబ్ మీడియాకు పాకింది. కల్కి ఈ స్దాయి హిట్ అవటానికి కారణం డైరక్టర్ ఎంచుకున్న కథ వల్లే అని అమితాబ్, కమల్ చెప్పటం కూడా ఈ డిస్కషన్ మొదలు కావటానికి ఓ కారణం కావచ్చు. వాళ్లు ప్రత్యేకంగా ప్రభాస్ ని ప్రస్తావించలేదు. దాంతో చాలా మంది ప్రబాస్ అభిమానులు కు కోపం వస్తోంది. ప్రభాస్ లేకపోతే ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చి ఉండేవా? ఈ విషయాన్ని కమల్ ఎందుకు ప్రస్తావించరు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అమితాబ్ తాజా స్టేట్మెంట్ లో ప్రభాస్ కు వెయ్యికోట్లు కామన్ అన్నట్లు గా మాట్లాడారు.
ఎంత గొప్ప కథ ఉన్నా...ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దాన్ని మోసాడు కాబట్టే ఇప్పుడు ఈ కలెక్షన్స్ కుంభవృష్టి కురుస్తోంది, అదిరిపోయే రికార్డ్ లు కనపడుతున్నాయంటున్నారు. కల్కి సక్సెస్ ను తను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు కమల్. కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అన్నారు. సినిమాలో కొంతమంది బిగ్ స్టార్స్ నటించినప్పటికీ, సక్సెస్ కు మెయిన్ కారణం నాగ్ అశ్విన్ ఐడియా అని తేల్చిచెప్పటం జరిగింది. "నేను వసూళ్లు గురించి మాట్లాడ్డం లేదు, సినిమా ఇచ్చిన ఆనందం గురించి మాట్లాడుతున్నాను. ఆ సంతోషంలో మీరు కూడా పాలుపంచుకోండి" అని ఆహ్వానిస్తున్నారు కమల్ హాసన్. అయితే ఎవరెన్ని అన్నా ప్రభాస్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ స్దాయి విజయం లేదనేది నిజం.
మరో ప్రక్క తాజాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్ కెరీర్‌లో రోటీన్ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్లను దాటగా, భారత్‌లో రూ.584 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఇప్పటికే ‘యానిమల్’ (553.87 కోట్లు) వసూళ్లను దాటగా, షారుఖ్‌ఖాన్ ‘జవాన్’ (రూ.640.25 కోట్లు) రికార్డును బద్దలు కొట్టే దిశగా వెళ్తోంది. ఇక ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (రూ.1030.42 కోట్లు) ఇప్పటికీ టాప్‌లోనే ఉండటం గమనార్హం. మరోవైపు బుకింగ్స్‌లోనూ ‘కల్కి’ హవా కొనసాగుతోంది. బుక్‌మై షోలో 10 మిలియన్ల టికెట్లు విక్రయమైన చిత్రంగా ‘జవాన్’ పేరిట రికార్డు ఉండగా తాజాగా దాన్ని అధిగమించింది. ‘కల్కి’కి ఇప్పటివరకూ 12 మిలియన్ల టికెట్ల విక్రయమైనట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.