మీ ట్వీట్ పది లక్షల సార్లు చదివా మహేష్ సార్... సాయి పల్లవి ఆనందం!

Published : Sep 28, 2021, 09:32 AM IST
మీ ట్వీట్ పది లక్షల సార్లు చదివా మహేష్ సార్... సాయి పల్లవి ఆనందం!

సారాంశం

లవ్ స్టోరీ(Love story) మూవీ తనకు చాలా బాగా నచ్చినట్లు మహేష్(Mahesh babu) తెలియజేశారు. ఆయన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను పొగుడుతూ వరుస ట్వీట్స్ చేశారు. 

నాగ చైతన్య-సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్ లవ్ స్టోరీ... బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు వెళుతుంది. నాలుగు రోజుల్లో లవ్ స్టోరీ యాభై కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్  సాధించినట్లు నిర్మాతలు తెలిపారు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న లవ్ స్టోరీ కలెక్షన్స్ పరంగా మాత్రం జోరు చూపిస్తుంది. 


ఇక టాలీవుడ్ ప్రముఖులు లవ్ స్టోరీ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరో చైతు నటన, సాయి పల్లవి డాన్సులు అద్భుతం అంటున్నారు. ఎప్పటిలాగే శేఖర్ కమ్ముల తన దర్శకత్వ ప్రతిభ చూపారని మెచ్చుకుంటున్నారు. ఇక లవ్ స్టోరీ మూవీ తనకు చాలా బాగా నచ్చినట్లు మహేష్ తెలియజేశారు. ఆయన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను పొగుడుతూ వరుస ట్వీట్స్ చేశారు. 


సాయిపల్లవి అద్భుత నటనను కనబరిచిందని ట్వీట్ చేస్తూ.. 'ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా? స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్‌ చేయడం ఇంతవరకు చూడలేదు' అంటూ పేర్కొన్నారు.


ఇక సాయి పల్లవి మహేష్‌ చేసిన ట్వీట్‌ పై స్పందించింది. మహేష్‌ చేసిన ట్వీట్‌కు కామెంట్‌ చేస్తూ.. ‘మీ మాటలు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్‌. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్‌ను ఇప్పటికీ లక్షలసార్లు చదివించింది సార్‌’ అంటూ రాసుకొచ్చింది సాయి పల్లవి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌