సెన్సేషనల్ అప్డేట్.. విజయ్ దేవరకొండ 'లైగర్'లో గ్రేట్ మైక్ టైసన్, ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి..

pratap reddy   | Asianet News
Published : Sep 27, 2021, 05:13 PM ISTUpdated : Sep 27, 2021, 05:14 PM IST
సెన్సేషనల్ అప్డేట్.. విజయ్ దేవరకొండ 'లైగర్'లో గ్రేట్ మైక్ టైసన్, ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి..

సారాంశం

విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రం నుంచి సెన్సేషనల్ అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. 

విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రం నుంచి సెన్సేషనల్ అప్డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. సినిమాపై అంచనాలని అమాంతం పెంచేలా అదిరిపోయే అప్డేట్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

లెజెండ్రీ బాక్సర్, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న మైక్ టైసన్ లైగర్ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఆయన నటిస్తున్న మొట్టమొదటి చిత్రం ఇదే. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలోకి మైక్ టైసన్ ఎంట్రీ ఇస్తున్నారు. 

మైక్ టైసన్ ఎంట్రీతో లైగర్ భారీ ప్రాజెక్ట్ గా మారిపోయింది. అభిమానులు ముద్దుగా ఐరన్ మైక్ అనిపిలుచుకునే మైక్ టైసన్ బాక్సింగ్ చరిత్రలో తిరుగు లేని రారాజుగా వెలుగొందాడు. ఆయన లైగర్ చిత్రంలో కనిపించనుండడం ఇండియాలో ఉన్న టైసన్ అభిమానులకు పండగే. 

ఈ క్రేజీ అప్డేట్ ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
రష్మిక మందన్న, రణ్ వీర్ సింగ్, రిషబ్ శెట్టితో పాటు, 2025లో బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా?