ఓటిటిలో భీమ్లా నాయక్... నో ఛాన్స్ అంటున్న నిర్మాత!

Published : Sep 28, 2021, 07:58 AM IST
ఓటిటిలో భీమ్లా నాయక్... నో ఛాన్స్ అంటున్న నిర్మాత!

సారాంశం

భీమ్లా నాయక్(Bheemla Nayak) ఓటిటిలో విడుదల కానున్నట్లు ఓ వాదన ప్రచారంలోకి వచ్చింది. దీనిపై చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ విడుదలపై ఉన్న అనుమానాలు తీర్చేశారు ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీతో పాటు విడుదల చేయనున్న వేదిక కూడా నిర్ణయించారు. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ గా దర్శకుడు సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ పోలీస్ అధికారిక నటిస్తుండగా, మరో హీరోగా రానా నటిస్తున్నారు. 


ఓ పోలీస్, ఆర్మీ అధికారి మధ్య నడిచే ఆత్మాభిమానం, ఆధిపత్య పోరుగా భీమ్లా నాయక్ తెరకెక్కుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకోగా, సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ప్రోమోలు, సాంగ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ఓటిటిలో విడుదల కానున్నట్లు ఓ వాదన ప్రచారంలోకి వచ్చింది. 


దీనిపై చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. భీమ్లా నాయక్ మూవీ జనవరి 12, 2022న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. దీనితో ఆయన పుకార్లకు చెక్ పెట్టారు. పవన్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ మూవీ ఓటిటిలో విడుదల కావడం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. వకీల్ సాబ్ విషయంలో కూడా ఇలాంటి వార్తలు వినిపించగా, థియేటర్స్ లోనే సినిమా విడుదల చేయాలని పట్టుబట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే