శర్వానంద్ అలవాట్లు.. ఆ హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్నాయా..?

Published : Jul 30, 2018, 12:15 PM IST
శర్వానంద్ అలవాట్లు.. ఆ హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్నాయా..?

సారాంశం

శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శర్వానంద్ టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు హనురాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

శతమానం భవతి, మహానుభావుడు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శర్వానంద్ టాలీవుడ్ లో టాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు హనురాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది. రీసెంట్ గా కలకత్తా షెడ్యూల్ ను పూర్తి చేసిన చిత్రబృందం కొత్త షెడ్యూల్ కు సిద్ధమవుతోంది.

నిజానికి ఈ సినిమా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ జరుపుకోవడం లేదని సమాచారం. దానికి కారణం శర్వానంద్ అని చెబుతున్నారు. తన వ్యక్తిగత అలవాట్ల కారణంగా శర్వానంద్ రోజు రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడంతో సెట్స్ కు ఉదయాన్నే రావడం లేదని సమాచారం.

ఉదయాన్నే 8 గంటలకు షూటింగ్ మొదలుపెట్టాలి. హీరోయిన్ 7 గంటలకు సెట్స్ కు చేరుకొని మేకప్ వేసుకొని 8 గంటలకు సిద్ధంగా ఉన్నా.. శర్వానంద్ మాత్రం రావడం లేదట. మధ్యాహ్నం సమయానికి అతడు సెట్ కు చేరుకోవడంతో షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదని సమాచారం. శర్వా ప్రవర్తన ఇలానే ఉండడం పైగా దర్శకనిర్మాతలు కూడా అతడిని ప్రశ్నించకపోవడంతో సాయి పల్లవి అసహనానికి లోనైందని సమాచారం.

చూసి, చూసి ఇక ప్రయోజనం లేదనుకొని నేరుగా దర్శకనిర్మాతలను, శర్వానంద్ ను ప్రశ్నించింది. వర్క్ విషయంలో నిబద్దత లేకపోవడంతో సాయి పల్లవి యూనిట్ పై ఫైర్ అయిందని సమాచారం. ఈ ఆలస్యం కారణంగా సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమా పూర్తయ్యే నాటికి రూ.40 కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతకుమించి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇది శర్వా మార్కెట్ కు చాలా ఎక్కువనే చెప్పాలి. మరి ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకొస్తుందో లేదో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే