తన పెళ్లి రహస్యం బయటపెట్టింది సాయి పల్లవి, తన బామ్మ ఇచ్చిన చీర సెంటిమెంట్ పై ఆమో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సాయి పల్లవి ఏమన్నదంటే?
ఈ జనరేషన్ లో సహజ నటి ఎవరు అనే ప్రశ్న వస్తే.. వెంటనే సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన హీరోయిన్ సాయి పల్లవి. మేకప్ వేసుకోకపోయినా, సింపుల్ లుక్ లో సినిమాలు చేస్తూ.. స్టార్ డమ్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. గ్లామర్ ఫీల్డ్ లో పోటీని తట్టుకుని నేచురల్ బ్యూటీతో ఈ స్థాయికి రావడం అందరికి సాధ్యం కాదు. అందుకే సాయి పల్లవికి భారీ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. ఆమె సహజమైన నటన వల్లనే సాయి పల్లవి సినిమాలను ప్రేక్షకులకు ఇష్టపడుతున్నారు.
ఇక ఈ విషయంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. నాకు ఎప్పుడూ నేషనల్ అవార్డు గెలవాలని ఉండేది. ఎందుకంటే నాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు మా భామ్మ నాకు ఒక చీర ఇచ్చింది. ఆ చీరను నా చేతిలో పెట్టి దీన్ని నీ పెళ్లికి కట్టుకోవాలని చెప్పింది. ఆ సమయంలో ఆమెకు ఆరోగ్యం సరిగా లేదు, ఆపరేషన్ అయింది. ఆ సమయంలో నా పెళ్ళే ముందు అనుకుని పెళ్ళిలో కట్టుకోవాలని అనుకున్నాను. కానీ నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న టైమ్ లోనే సినిమా రంగంలోకి వచ్చాను' అని సాయి పల్లవి వెల్లండించింది.
నా మొదటి సినిమా 'ప్రేమమ్' 23 ఏళ్ల వయస్సులో ఈసినిమా చేశాను. ప్రేమమ్ చేస్తున్నప్పుడే ఏ రోజైన నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. ఎలాగో పెళ్లి కాలేద కదా.. నేషనల్ అవార్డ్ వస్తే.. అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకొని అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకావాలని ఫిక్స్ అయ్యాను.ఒక వేళ అవార్డు రాకపోయినా కూడా చీర కట్టుకోవాలనే ఒత్తిడి ఉంటుందని సాయి పల్లవి చెప్పారు. సాయి పల్లవికి జాతీయ అవార్డ్ రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గతంలో తాను నటించిన గార్గి'మూవీకి నేషనల్ అవార్డు వస్తుందని అందరు అనుకున్నారు. ఈసినిమా ప్లాప్ అయినా.. ఆమె నటన మాత్రం అంతలా మెస్మరైజ్ చేసింది. కానీ చివరి నిమిషంలో ఆ అవార్డు వేరే వాళ్ళని వరించింది. ఇప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ లో ఉన్న హోప్స్ ఏంటంటే.. అమరన్ సినిమాకు కాని. తండేల్ సినిమాకు కాని ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాకుగాను సాయి పల్లవికి తప్పకుండా జాతీయ అవార్డ్ వస్తుందని నమ్ముతున్నారు.
Also Read: జయసుధను జుట్టుపట్టి కొట్టిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? వీరిద్దరి మధ్య అసలు గొడవేందుకు వచ్చింది?
అంతే కాదు ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో రామాయణ మూవీ చేస్తుంది.పాన్ ఇండియా సినిమాలో 'సీతమ్మ తల్లి' క్యారక్టర్ చేస్తుండటంతో, ఈసారి నేషనల్ అవార్డు అందుకోవడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యి ఉన్నారు. అంతే కాదు మరికొన్ని హిందీ ప్రాపెక్ట్స్ కు సాయిపల్లవి సైన్ చేస్తోందట. మరి ఈసారైనా సాయి పల్లవి కోరిక నెరవేరుతుందా లేదా చూడాలి.