Arijit Singh Heart Touching Songs: అర్జిత్ సింగ్ పాటలకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలి అనిపిస్తుంటుంది. ఆ గాత్రంలో అంత మాధుర్యం ఉంటుంది. ఇక ఆయన పాడిన హాట్ టచ్చింగ్ పాటలయితే చెప్పనక్కర్లేదు. అర్జిత్ పాడిన ఆ పాటలేవో ఇప్పుడు చూద్దాం.
Arijit Singh's Top 10 Heart-Touching Songs: సింగర్ అర్జిత్ సింగ్ పాటల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర రియాలిటీ షో నుండి వెలుగులోకి వచ్చిన అర్జిత్ సింగ్ స్టార్ సింగర్ గా ఎదిగాడు. భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వచ్చాడు. ఇండియన్ స్టార్ సింగర్స్‌లో ఇప్పుడు ఆయన కూడా ఒకరు. సంగీతానికి భాష ముఖ్యం కాదు అనేది ప్రస్తుతం శ్రోతల టేస్ట్ ను బట్టి అర్ధం అవుతోంది. పాట లిరిక్స్ అర్థం కాకపోయినా ఈ రోజుల్లో ప్రజలు వేరే భాషల పాటలు కూడా వింటారు. అర్జిత్ సింగ్ పాటలకు హిందీలో మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. అర్జిత్ సింగ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటే సంగీతాభిమానులు వేల రూపాయలు పెట్టి టికెట్ కొంటారు. అర్జిత్ సింగ్ వాయిస్‌లోని మ్యాజిక్ వినేవాళ్ళని మత్తులోకి దించుతుంది. మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇక ఇప్పుడు అర్జిత్ సింగ్ హార్ట్ టచింగ్ సాంగ్స్ గురించి చూద్దాం.
Also Read: సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?
టాప్ 10: ఏ దిల్ హై ముష్కిల్ (Ae Dil Hai Mushkil)
ఈ సాంగ్ యూట్యూబ్‌లో 2 కోట్ల 80 లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా టైటిల్ ట్రాక్ ఇది. అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా, ప్రీతమ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.
టాప్ 9: జో బీగీ థీ దువా (Jo Bheji Thi Duaa)
షాంఘై సినిమాలోని సూపర్ హిట్ జో బీగీ థీ దువా సాంగ్‌ని మీ ప్లే లిస్ట్‌లో తప్పకుండా చేర్చుకోండి. ఈ పాటని అర్జిత్ సింగ్, నందిని శ్రీకర్ కలిసి పాడారు. యూట్యూబ్‌లో ఈ పాటకు 97,647,918 వ్యూస్ వచ్చాయి. విశాల్ - శేఖర్ మ్యూజిక్ కంపోజిషన్‌లో ఈ పాట రూపొందింది.
టాప్ 8: థోడీ జగ దే ముజే (thodi jagah de de mujhe)
సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన మర్‌జావాన్ సినిమాలోని థోడీ జగ దే ముజే సాంగ్‌ని ఒంటరిగా ప్రశాంతంగా వినాలి అనుకుంటే ఈ పాట బెస్ట్ ఆప్షన్. అందుకే మీ ప్లే లిస్ట్‌లో చేర్చుకోండి. తనిష్క్ బగ్చి మ్యూజిక్ కంపోజిషన్‌కి రష్మీ విరాగ్ అద్భుతంగా లిరిక్స్ రాశారు. రష్మీ రాసిన ప్రతి పదానికి అర్జిత్ సింగ్ ప్రాణం పోశారు.
టాప్ 7: ఖరియత్ పూచో (Khariyat Poochho)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ నటించిన 'చిచోరే' సినిమాలోని ఈ పాట మిమ్మల్ని ప్రేమలో ముంచెత్తుతుంది. ఈ పాట ప్రీతమ్ మ్యూజిక్ కంపోజిషన్‌లో రూపొందింది. అర్జిత్ సింగ్ వాయిస్ వినేవాళ్లలో ప్రతిసారి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పాట అమితాబ్ భట్టాచార్య కలంలో రూపుదిద్దుకుంది.
టాప్ 6: చాహుం మే ఆనా (Chahun Main Ya Naa)
2013లో రిలీజ్ అయిన ఆషికి-2 సినిమాలోని చాహుం మే ఆనా పాట ప్రేమికులకు భక్తి గీతంలాంటిది. జీత్ గంగూలీ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ డ్యూయెట్ సాంగ్‌ని అర్జిత్ సింగ్, పలక్ ముచ్చల్ పాడారు. ఇది కూడా మనసును పిండేస్తుంది. తెలియకుండా కళ్లు చెమర్చుతాయి ఈ పాట వింటే.
టాప్ 5: తుమ్ హి హో (Tum Hi Ho)
మ్యూజికల్ సూపర్ హిట్ ఆషికి-2 సినిమాలోని మరో పాట 'తుమ్ హి హో' నరనరాల్లో ప్రేమను నింపుతుంది. 11 ఏళ్ల కిందట వచ్చిన ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. మిథున్ కంపోజ్ చేసి లిరిక్స్ రాసిన ఈ పాటకు అర్జిత్ సింగ్ వాయిస్ అందించారు. ఈ పాట వింటె తెలియని అనుభూతి మనసును తాకుతుంది.
టాప్ 4: హమారీ అధూరీ కహానీ (Hamari Adhuri Kahani)
ఇమ్రాన్ హష్మీ, విద్యా బాలన్ నటించిన స్వచ్ఛమైన ప్రేమకథ హమారీ అధూరీ కహానీ టైటిల్ ట్రాక్‌ని అర్జిత్ సింగ్ వాయిస్‌లో వినొచ్చు. జీత్ గంగూలీ కంపోజ్ చేయగా, రష్మీ సింగ్, విరాగ్ మిశ్రా లిరిక్స్ రాశారు. ప్రేమను కోల్పోయిన హృదయం పడే వేదనను, ఆ నొప్పిని సింపుల్ పదాల్లో చెప్పారు.
టాప్ 3: హజారోం మే కిసీ కో తక్‌దీర్ (Hazaro me kisi ko taqdeer)
బాలీవుడ్ మరో మ్యూజికల్ హిట్ సినిమా కలంక్. ఈ చిత్రంలోని హజారోం మే కిసీ కో తక్‌దీర్ పాటని మీ ప్లే లిస్ట్‌లో చేర్చుకోండి. 2019లో రిలీజ్ అయిన ఈ పాటని కోట్లాది మంది విన్నారు. ప్రీతమ్, అమితాబ్ భట్టాచార్య జోడీ మరోసారి మ్యాజిక్ చేశారు. పాటతో పాటు అర్జిత్ సింగ్ దీనికి హార్మోనియం కూడా వాయించారు.
టాప్ 2: అగర్ తుమ్ సాథ్ హో (Agar Tum Saath Ho)
అర్జిత్ సింగ్ పాటల్లో అగర్ తుమ్ సాథ్ హో టాప్ 2లో ఉంది. తమాషా సినిమాలోని ఈ పాట ప్రేమికుల కోసం చేసిన సాంగ్. 2015లో రిలీజ్ అయిన అగర్ తుమ్ సాథ్ హో పాటని అల్కా యుగ్నిక్, అర్జిత్ సింగ్ కలిసి పాడారు. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇర్షాద్ కమల్ ఈ పాటకు పదాలు కూర్చారు.
టాప్ 1: చోడ్ దియా ఓ రాస్తా (Chhod Diya Wo Rasta)
చోడ్ దియా ఓ రాస్తా పాటకు దేశం మొత్తం ఫిదా అయింది. అర్జిత్ సింగ్ టాప్ సాంగ్స్‌లో దీనికి నంబర్ వన్ స్థానం ఇచ్చారు. కనికా కపూర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ రాశారు. బ్రేకప్ తర్వాత ఒక యువకుడి మనసులోని మాటలే ఈ పాట. 2018లో ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్ అయింది.
Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Also Read: 5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?