బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుందట. బాలయ్యకి విలన్ పాత్రలో ఆమె కనిపిస్తుందని తెలుస్తుంది.
ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌కి క్యూ కడుతున్నారు. దీపికా పదుకొనె, అలియాభట్, కృతిసనన్, కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు మరో హీరోయిన్ కూడా టాలీవుడ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటికే ఓ మూవీ చేసి చేదు అనుభవాన్ని ఫేస్ చేసిన ఆ నటి ఇప్పుడు విలన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతుందట.
బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2` సినిమాలో నటిస్తున్నారు. `అఖండ2ఃతాండవం` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇందులో విలన్‌గా ఆదిపినిశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రారంభమైన శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇందులో బాలయ్య.. ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి మామూలు పాత్ర అయితే, మరోటి అఘోర పాత్ర. ఇప్పుడు రెండో పార్ట్ ఎక్కువగా అఘోర పాత్ర చుట్టూ తిరుగుతుందట.
ఇదిలా ఉంటే `అఖండ 2`లో భారీ కాస్టింగ్ యాడ్ కాబోతుందట. బాలీవుడ్ హీరోయిన్‌ని దించబోతున్నారట. బాలీవుడ్ నటి విద్యా బాలన్ కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. గతంలో విద్యా బాలన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఎన్టీఆర్` బయోపిక్‌లో నటించింది. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో ఆమె మెరిసింది. కానీ ఆ సినిమా ఆడలేదు.
ఇప్పుడు మరోసారి బాలయ్య సినిమాలో విద్యా బాలన్ కనిపిస్తారని తెలుస్తుంది. ఇందులో ఆమెది చాలా కీలక పాత్ర అని తెలుస్తుంది. రాజకీయ నాయకురాలిగా కనిపిస్తుందని అంటున్నారు. అంతేకాదు ఆమె పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉంటుందట. ఓ రకంగా విలన్ రోల్ అని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక `అఖండ 2` మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ప్రకటించింది. దసరా కానుకగా దీన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సారి పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని సమాచారం.
మరోవైపు విద్యా బాలన్ బాలీవుడ్‌లో బిజీగా ఉంది. గతేడాది ఆమె `దో ఔర్ దోప్యార్`, `భూల్ భులైయ్యా 3`, `చిత్రాల్లో నటించింది. `భూల్ భులైయ్యా 3` పెద్ద హిట్ అయ్యింది. ఇందులో ఘోస్ట్ గా కనిపించింది విద్యాబాలన్.
also read: మా సినిమాలు చూడకండి, రివ్యూస్ రాయకండి.. నిర్మాత నాగవంశీ ఫైర్, టార్గెట్ `భారతీయుడు`?