సాయిధరమ్‌ తేజ్‌ `రిపబ్లిక్‌` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

Published : Sep 18, 2021, 05:43 PM IST
సాయిధరమ్‌ తేజ్‌ `రిపబ్లిక్‌` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ఎప్పుడంటే?

సారాంశం

`రిపబ్లిక్‌` సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం `రిపబ్లిక్‌` సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా చిత్ర రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని `యూ/ఏ` సర్టిఫికేట్‌ని పొందింది.

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్‌ తీసేసినట్టు వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆయన నటించిన `రిపబ్లిక్‌` సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం `రిపబ్లిక్‌` సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. తాజాగా చిత్ర రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 

ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని `యూ/ఏ` సర్టిఫికేట్‌ని పొందింది. దీంతో రిలీజ్‌కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో అక్టోబర్‌ 1న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జెబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించి.. గతంలో విడుదలైన టీజర్, సింగిల్ .. సినిమా మీద అంచనాల్ని పెంచాయి.

కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ అనంతరం `సోలో బ్రతుకే సో బెటర్` మూవీతో థియేటర్ లో సందడిచేసిన సాయిధరమ్ తేజ.. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత `రిపబ్లిక్`తో మరోసారి ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్నాడు. అయితే ఓ సామాజిక అంశంతో రాబోతుండటంతో సినిమాపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?