స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్, ఆ గుడ్ న్యూస్ చెప్పిన వైద్యులు

pratap reddy   | Asianet News
Published : Sep 18, 2021, 05:38 PM ISTUpdated : Sep 18, 2021, 05:40 PM IST
స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. లేటెస్ట్ హెల్త్ బులిటెన్, ఆ గుడ్ న్యూస్ చెప్పిన వైద్యులు

సారాంశం

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. అయితే హెల్మెట్ ధరించడంతో తేజుకి పెను ప్రమాదం తప్పింది.

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. అయితే హెల్మెట్ ధరించడంతో తేజుకి పెను ప్రమాదం తప్పింది. వరం రోజులుగా తేజుకి అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

వైద్యుల చికిత్సకు తేజు స్పందిస్తుండడంతో అతడి ఆరోగ్యం కుదుటపడుతోంది. తాజాగా అపోలో వైద్యులు తేజు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలొ ఉన్నారని వైద్యులు ప్రకటించారు. అలాగే మరో గుడ్ న్యూస్ కూడా ప్రకటించారు. 

తేజుకి వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. తేజు సొంతంగానే శ్వాస తీసుకుంటుండడంతో వెంటిలేటర్ తొలగించారు. అయితే మరికొన్ని రోజుల పాటు తేజు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతారని తెలిపారు. 

బైక్ నుంచి పడ్డ తేజుకి శరీరంపై అక్కడక్కడా గాయాలయ్యాయి. కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడంతో వైద్యులు విజయవంతంగా సర్జరీ చేశారు. తేజు ప్రమాదానికి గురికావడం మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులని ఆందోళనకు గురి చేసింది. అయితే తేజుకి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. దేవాకట్టా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.   

PREV
click me!

Recommended Stories

Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?