సమంత అందగత్తె, ట్రై చేద్దామంటే నాగచైతన్య ఎగరేసుకుపోయాడు

Published : Aug 16, 2017, 06:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
సమంత అందగత్తె, ట్రై చేద్దామంటే నాగచైతన్య ఎగరేసుకుపోయాడు

సారాంశం

సమంత అందగత్తె అని, తనకు చాలా ఇష్టమని అంటున్న సాయిధరమ్ తేజ్ తను  ట్రై చేద్దామంటే నాగచైతన్య ఎగరేసుకుపోయాడంటున్న సుప్రీం హీరో సమంత,నాగచైతన్యల పెళ్లి కుదరకుంటే.. తాను ట్రై చేసేవాడినంటున్న తేజ్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి పోలికలతో.. ఆయనకు ప్రతిరూపంగా ఉంటాడు. దీనికితోడు తన క్రేజ్ ఏమాత్రం తగ్గిపోకుండా సోషల్ మీడియా దృష్టిని ఎప్పటికప్పుడు తనదైన కమెంట్స్ పెడుతూ ఆకర్షిస్తూ వుంటాడు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్ లోని ఒక మిలిటరీ బెటాలియన్ జవాన్లతో సాయిధరమ్ తేజ్ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకున్నాడు.

ఈ సందర్భంగా పలువురు జవాన్లు, వారు కుటుంబ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఇందులో భాగంగా తనకిష్టమైన హీరోయిన్ సమంత అని.. ఆమె చాలా అందంగా వుంటుందని అన్నాడు. అంతేకాదు సమంతకు నాగచైతన్య కు పెళ్లి ఫిక్స్ కాకుంటే తాను సీరియస్ గా ట్రై చేసేవాడినని తేజ్  చెప్పడంతో అక్కడంతా నవ్వులు పూసాయి. 

 

ఇక తనకు  ఇష్టమైన స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ అని, తనకు బాగే నచ్చే హీరోలలో తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తర్వాత తనకు నచ్చిన హీరోలు రవితేజ, ప్రభాస్ అని మరో ట్విస్ట్ ఇచ్చాడు.  మల్టీ స్టారర్ చిత్రం చెయ్యాల్సి వస్తే  తానూ రవితేజతో కలిసి నటించేందుకు ఇష్టపడుతున్నానని చెప్పాడు.

 

ఇక తన మొదటి హీరోయిన్ రెజీనా గురించి ప్రస్తావిస్తూ తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదరడంతో మీడియా ఏదో ఊహించుకుని తమ మధ్య వార్తలు రాసిందన్నాడు.

 

ఇక ఆఫర్ల విషయంలో సాయిధరమ్ తేజ్ కు లోటు ఉండట్లేదు. మొన్ననే వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా ప్రారంభమైంది. ఇవాళ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మరో కొత్త సినిమా లాంచ్ అయింది. ‘తొలిప్రేమ’ టైపులో ఫ్రెష్ లవ్ స్టోరీగా ఈ మూవీ కథ వుంటుందని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే