పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన మెగాస్టార్ 151వ చిత్రం

Published : Aug 16, 2017, 05:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన మెగాస్టార్ 151వ చిత్రం

సారాంశం

పూజా కార్య‌క్ర‌మాల‌తో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా  గ్రాండ్ గా  ప్రారంభ‌ం బుధ‌వారం ఉద‌యం కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కార్యాలయంలో ప్రారంభం ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం నాడు టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల  

బుధ‌వారం ఉద‌యం కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ కార్యాలయంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా  గ్రాండ్ గా  ప్రారంభ‌మైంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాంచరణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. 

 

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ తోపాటు, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క‌, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మెగాస్టార్  చిరంజీవి, సురేఖ, అల్లు అర‌వింద్, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, డాక్ట‌ర్ కె. వెంక‌టేశ్వ‌ర‌రావు తదితరులతో పాటు, చిత్ర నిర్మాత‌ రాంచరణ్‌,  ద‌ర్శ‌కులు సురేంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే