ఇంకా స్పృహలోకి రాలేదు... సాయి ధరమ్ హెల్త్ కండిషన్ పై పవన్ ఫస్ట్ రియాక్షన్

Published : Sep 11, 2021, 12:17 AM IST
ఇంకా స్పృహలోకి రాలేదు... సాయి ధరమ్ హెల్త్ కండిషన్ పై పవన్ ఫస్ట్ రియాక్షన్

సారాంశం

సాయి ధరమ్ తేజ్ చికిత్స అందిస్తున్న గదికి పవన్ కళ్యాణ్ వెళ్లడం జరిగింది. అలాగే ధరమ్ హెల్త్ కండీషన్ గురించి పవన్ కళ్యాణ్ వైద్యులను అడిగి తెలుకున్నారు.

సాయి ధరమ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ చికిత్స అందిస్తున్న గదికి పవన్ కళ్యాణ్ వెళ్లడం జరిగింది. అలాగే ధరమ్ హెల్త్ కండీషన్ గురించి పవన్ కళ్యాణ్ వైద్యులను అడిగి తెలుకున్నారు. 


అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ధరమ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు పవన్... అపస్మారక స్థితిలోనే ఉన్నారు. కాసేపటి తరువాత వివరాలు వెల్లడిస్తాం అంటూ... ఎక్కువ సేపు మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీనితో ప్రమాద వలన ఏర్పడిన షాక్ నుండి సాయి ధరమ్ బయటికి రాలేదని అర్థం అవుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియజేస్తున్నారు. 
  
 శుక్రవారం సాయంత్రం స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ సాయి ధరమ్ ప్రధానికి గురయ్యారు. . ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలైనాయి.  బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ మలుపు వద్ద బైక్ స్కిడ్ కావడంతో  ధరమ్ తేజ్ ఒక్కసారిగా కిందపడ్డారు.  అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఆయన కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?
ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్