ప్రాథమిక సమాచారం.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం ఇదే!

Published : Sep 10, 2021, 11:25 PM IST
ప్రాథమిక సమాచారం.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి కారణం ఇదే!

సారాంశం

ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ధరమ్ తేజ్ ని మొదట ఎవరో యువకుడు అని, ప్రమాద సమయంలో అక్కడ ఉన్న వారు భావించారు. సాయి ధరమ్ తేజ్ అని గుర్తించిన అనంతరం, పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన వైద్యం కోసం ఆయనను జూబ్లీ హిల్స్  అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. 

ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే మెడికవర్ హాస్పిటల్ కి చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు హీరో సందీప్ కిషన్, ధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ అక్కడకు చేరుకున్నారు. అనంతరం చిరంజీవి, అల్లు అరవింద్, నిహారిక సైతం ఆసుపత్రికి రావడం జరిగింది. 
ఈ ప్రమాదానికి అసలు కారణం కేబుల్ బ్రిడ్జ్ పై ఉన్న ఇసుక అని తెలుస్తుంది. ఎక్కువ మొత్తంలో రోడ్డుపై ఒక చోట చేరిన ఇసుక, బైక్ అదుపు తప్పడానికి కారణం అంటూ... స్థానికులు, అలాగే పోలీసులు నిర్ధారిస్తున్నారు. సాయి ధరమ్ హెల్మెంట్ ధరించి ఉండడం వలన పెను ప్రమాదం తప్పిందని, దాని వలన ఆయన తక్కువ గాయాలతో బయటపడగలిగారని అంటున్నారు.  

ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ధరమ్ తేజ్ ని మొదట ఎవరో యువకుడు అని, ప్రమాద సమయంలో అక్కడ ఉన్న వారు భావించారు. సాయి ధరమ్ తేజ్ అని గుర్తించిన అనంతరం, పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: హీరోలు ఒకరి తర్వాత ఒకరు..దుబాయ్ మోజు వెనుక ఇదే కారణం!
Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు