
మాదాపూర్ మెడికోవర్ హాస్పిటల్ కి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వస్తున్న ఆయన బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ధరమ్ తేజ్ కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ధరమ్ తేజ్ ని దగ్గర్లో గల మెడికోవర్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఉండవచ్చునని వైద్యులు ఆనుమానాలు వ్యక్తం చేయడంతో సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు.
Also Read: హైదరాబాద్: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. హీరో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు
ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే మెడికోవర్ హాస్పిటల్ కి చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు హీరో సందీప్ కిషన్, ధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ అక్కడకు చేరుకున్నారు. అనంతరం చిరంజీవి, అల్లు అరవింద్ సైతం ఆసుపత్రికి రావడం జరిగింది.
Also Read: మెడికోవర్ హాస్పిటల్ లో ధరమ్ తేజ్ కి చికిత్స, అపోలోకు తరలింపు
ధరమ్ ప్రస్తుత కండీషన్ గురించి డాక్టర్స్ ని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుంటునట్లు సమాచారం. ఇక ధరమ్ వైద్య చికిత్సను పవన్ అక్కడే ఉండి పరిశీలిస్తున్నారు. కాగా ధరమ్ ఆపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాలిన అవరం లేదని డాక్టర్స్ చెప్పడం శుభపరిణామం.