మెడికవర్  హాస్పిటల్ లో ధరమ్ తేజ్ కి చికిత్స, అపోలోకు తరలింపు

Published : Sep 10, 2021, 10:27 PM ISTUpdated : Sep 10, 2021, 11:19 PM IST
మెడికవర్  హాస్పిటల్ లో ధరమ్ తేజ్ కి చికిత్స, అపోలోకు తరలింపు

సారాంశం

మెడికోవర్ హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్ కి చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి స్కానింగ్స్ నిర్వహించారు. కాగా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. 

ప్రముఖ సినీహీరో సాయధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు.  అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. 

ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మెడికోవర్ హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్ కి చికిత్స అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి స్కానింగ్స్ నిర్వహించారు. కాగా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. 

Also Read: హైదరాబాద్: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. హీరో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు

మెరుగైన చికిత్స కోసం సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. బైక్ హ్యాండిల్ పొట్టలో గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బైక్ స్కిడ్ అయిన తర్వాత కొంత దూరం జారింది. దీంతో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇసుక ఉండడం వల్ల బైక్ స్కిడ్ అయి కుడి వైపు పడిపోయినట్లు చెబుతున్నారు. 

రిపోర్ట్స్ అనంతరం ధరమ్ కి తగిలినగాయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాయి ధరమ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం.ప్రస్తుతం సాయి ధరమ్ రిపబ్లిక్ మూవీలో నటిస్తున్నారు. దేవా కట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?