సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌.. అసలైన పండుగ అంటూ ఫ్యామిలీ ఫోటో షేర్‌ చేసిన చిరు.. సాయితేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published : Nov 05, 2021, 09:11 PM ISTUpdated : Nov 05, 2021, 11:55 PM IST
సాయిధరమ్‌ తేజ్‌ లుక్‌.. అసలైన పండుగ అంటూ ఫ్యామిలీ ఫోటో షేర్‌ చేసిన చిరు.. సాయితేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకోలేదా? సాయికి ఏమైంది అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. మెగా ఫ్యాన్స్ తన అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అనుమానాలకు, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు మెగాస్టార్‌. సాయిధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌(Sai dharam Tej) రెండు నెలల క్రితం యాక్సిడెంట్‌కి గురైన విషయం తెలిసిందే. వినాయక చవితి(సెప్టెంబర్‌ 10) రోజున ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దాదాపు నెల రోజులకుపైనే ఆసుపత్రిలో ఉన్న సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుని ఇంటికి వెళ్లారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు, తన మంచి కోరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ సారి ట్విట్‌ చేశాడు సాయితేజ్‌. అయితే తన ఫోటోని మాత్రం పంచుకోలేదు. 

దీంతో Sai dharam Tej పూర్తిగా కోలుకోలేదా? సాయికి ఏమైంది అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. మెగా ఫ్యాన్స్ తన అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అనుమానాలకు, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు మెగాస్టార్‌. సాయితేజ్‌తోపాటు మెగా హీరోలంతా కలిసిన ఫోటోని పంచుకున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా మెగా హీరోలంతా కలిసి పండుగ చేసుకున్న ఫోటోని పంచుకున్నారు చిరంజీవి(Chiranjeevi). తమకి అసలైన పండుగ ఇదే అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నట్టు తెలిపారు. 

`అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ` అని పేర్కొంటూ సాయిధరమ్‌తేజ్‌తో దిగిన మెగా హీరోల ఫోటోని పంచుకున్నారు Chiranjeevi. ఇందులో సాయిధరమ్‌తేజ్‌, చిరంజీవితోపాటు పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ఉన్నారు. వీరితోపాటు పవన్‌ కళ్యాణ్‌ కుమారుడు అకిరా నందన్‌ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

దీపావళి పండుగ సందర్భంగా మెగా హీరోలంతా కలిసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రినే వీరంతా కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ ఫోటోని పంచుకుంటూ బన్నీ అందరికి దీపావళి విషెస్‌ తెలిపారు. ఇప్పుడు చిరంజీవి మెగా స్టార్‌ హీరోలందరు కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేయడం విశేషం. చిరంజీవి ఇంట్లో వీరంతా కలుసుకున్నారు. అయితే మామ చిరంజీవి పోస్ట్ కి సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు. ఓ ఎమోషనల్‌ పోస్ట్ పంచుకున్నారు. `నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం` అని తెలిపారు.

 

సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన `రిపబ్లిక్‌` చిత్రం థియేటర్‌లో విడుదలై మిశ్రమ స్పందన లభించుకుంది. మరోవైపు ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుంది. 

also read: Samantha: విడాకుల తర్వాత ఫస్ట్ దీపావళి... సమంత ఎవరితో సెలెబ్రేట్ చేసుకుందో తెలిస్తే షాక్
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

August Movies: ఆగష్టు రిలీజ్‌లు, డేంజర్ జోన్ లో ఉన్న హీరోలు ఇద్దరే.. దారుణమైన ఫ్లాపులకు బ్రేకులు పడతాయా ?
Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే