Kamal Haasan: కమల్‌ హాసన్‌ బర్త్ డే గిప్ట్ .. `విక్రమ్‌` స్నీక్‌ పీక్‌..

Published : Nov 05, 2021, 08:15 PM IST
Kamal Haasan: కమల్‌ హాసన్‌ బర్త్ డే గిప్ట్ .. `విక్రమ్‌` స్నీక్‌ పీక్‌..

సారాంశం

కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు ఆదివారం(నవంబర్‌7). ఈ సందర్భంగా రేపు(శనివారం)సాయంత్రం ఆరు గంటలకు ఈ చిత్రం నుంచి స్నీక్‌ పీక్‌ని రిలీజ్‌ చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు.

యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌(Kamal Haasan) నటిస్తున్న చిత్రం `విక్రమ్‌`(Vikram Movie). లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌, ఆర్ మహేంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు, `పుష్ప` ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేఘా ఆకాష్‌, శివాని నారాయణన్‌ ఫీమేల్‌ లీడ్‌ చేస్తున్నారు. 

Vikram సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో Kamal Haasan లుక్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. మాసిన గెడ్డంతో ఆయన అదరగొడుతున్నారు. కమల్‌, ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతిలతో కలిపి రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అదరగొట్టింది. మరోవైపు ఫస్ట్ గ్లింప్స్ మైండ్‌ బ్లోయింగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇప్పుడు మరో ట్రీట్‌ రాబోతుంది. కమల్‌ హాసన్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. 

కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు ఆదివారం(నవంబర్‌7). ఈ సందర్భంగా రేపు(శనివారం)సాయంత్రం ఆరు గంటలకు ఈ చిత్రం నుంచి స్నీక్‌ పీక్‌ని రిలీజ్‌ చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో వెనకాల మంటల్లో కమల్‌ గన్‌ పట్టుకుని కళ్లు మూసుకుని అలా పైకి చూస్తున్నట్టుగా ఉన్న లుక్‌ ఆకట్టుకుంటుంది. దీంతో బర్త్ డే సర్‌ప్రైజ్‌ కోసం కమల్‌ అభిమానులే కాదు, సినీ ప్రియులు ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ గూస్‌బమ్స్ తెప్పించింది. దీంతో ఈ ట్రీట్‌పై అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇక కమల్‌ హాసన్‌ గురించి అందరికి తెలిసిందే. ఆయన బాల్యం నుంచి నటనలోనే బతుకుతున్నారు. ఆరు దశాబ్దాలుగా ఆయన నటుడిగా రాణిస్తున్నారు. నాలుగు జాతీయ అవార్డులు, పద్మ శ్రీ, పద్మ భూషణ్‌ పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అనేక అంతర్జాతీయ అవార్డులు ఆయన్ని వరించాయి. నటనకు కేరాఫ్‌గా నిలిచే కమల్‌ యూనివర్సల్‌ నటుడిగా పేరుతెచ్చుకున్నారు. ఇండియన్‌ సినిమాకి ఓ గర్వకారణంగా నిలిచారు.

also read: పునీత్ సమాధి వద్ద కన్నీరు మున్నీరైన సూర్య.. మేమిద్దరం గర్భంలో ఉన్నప్పుడే..

 ఆరు దశాబ్దాల కెరీర్‌లో 220కిపైగా చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సింగర్‌గా, స్క్రీన్‌రైటర్‌గా, పాటల రచయితగా, టెలివిజన్‌ హోస్ట్ గా రాణిస్తుంది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. కమల్‌ నటించిన `భారతీయుడు 2` ఇటీవల మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో `విక్రమ్‌`ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

also read: `జై భీమ్‌`లో సినతల్లి ఎవరో తెలుసా?.. ఆమె నేపథ్యం, స్టడీస్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే