సాయి ధరమ్ సేఫ్ గా ఉన్నారు... తలకు, వెన్నెముకకు ఎటువంటి గాయాలు కాలేదు- అల్లు అరవింద్

Published : Sep 11, 2021, 12:39 AM IST
సాయి ధరమ్ సేఫ్ గా ఉన్నారు... తలకు, వెన్నెముకకు ఎటువంటి గాయాలు కాలేదు- అల్లు అరవింద్

సారాంశం

సాయి ధరమ్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ ప్రకటన చేశారు.   

రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వేగంగా వెళుతున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పడంతో సాయి ధరమ్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన అనంతరం సాయి ధరమ్ స్పృహ కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దగ్గర్లోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. 


సాయి ధరమ్ తేజ్ ప్రధానికి గురైన అనంతరం ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఆ మారాయి. ముఖం, ఛాతి భాగంలో సాయి ధరమ్ కి గాయాలైనట్లు ఫొటోల ద్వారా అర్థం అవుతుంది. సాయి ధరమ్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ ప్రకటన చేశారు. 


సాయి ధరమ్ తేజ్ సేఫ్ గా ఉన్నారు. రేపు ఉదయానికి ఆయన స్పృహలోకి వచ్చి మాట్లాడతారని వైద్యులు వెల్లడించారు. తలకు, వెన్ను పూసకు ఎటువంటి గాయాలు కాలేదు. ఇంటర్నల్ గా ఎటువంటి బ్లీడింగ్స్ లేవని డాక్టర్స్ ధృవీకరించారు. కావున ధరమ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ అధికారిక బులెటిన్ కాసేపట్లో విడుదల చేస్తారని అల్లు అరవింద్ స్పష్టత ఇచ్చారు. దీనితో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు