వెంటిలేటర్ తొలగించాం... సాయి ధరమ్ మాట్లాడుతున్నారు

Published : Sep 21, 2021, 08:57 AM IST
వెంటిలేటర్ తొలగించాం... సాయి ధరమ్ మాట్లాడుతున్నారు

సారాంశం

సాయి ధరమ్ పూర్తిగా కోలుకుంటున్నారని, ఆయన స్పృహలోకి వచ్చారని తెలిపారు. స్వయంగా శ్వాస తీసుకుంటున్నారు. అందుకే వెంటిలేటర్ తొలగించాము. మూడు రోజుల క్రితం ఐసీయూ నుండి సాధారణ వార్డ్ కి తరలించామని వైద్యులు వెల్లడించారు.

పది రోజులకు పైగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ తాజా ఆరోగ్య పరిస్థితిని వైద్యులు వివరించారు. సాయి ధరమ్ పూర్తిగా కోలుకుంటున్నారని, ఆయన స్పృహలోకి వచ్చారని తెలిపారు. స్వయంగా శ్వాస తీసుకుంటున్నారు. అందుకే వెంటిలేటర్ తొలగించాము. మూడు రోజుల క్రితం ఐసీయూ నుండి సాధారణ వార్డ్ కి తరలించామని వైద్యులు వెల్లడించారు. సాయి ధరమ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు డాక్టర్స్ తెలియజేశారు. 


దీనితో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 10 సాయంత్రం సాయి ధరమ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయి ధరమ్ బైక్ అదుపు తప్పడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఆయనను దగ్గర్లో ఉన్న మెడికవర్ హాస్పిటల్ నందు జాయిన్ చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 


ఇక సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ రిపబ్లిక్. దర్శకుడు తెరకెక్కించిన రిపబ్లిక్ సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా