ఎన్టీఆర్ షోకి గెస్ట్ గా మహేష్, షూట్ కూడా కంప్లీట్!

Published : Sep 21, 2021, 08:39 AM IST
ఎన్టీఆర్ షోకి గెస్ట్ గా మహేష్, షూట్ కూడా కంప్లీట్!

సారాంశం

 ఎన్టీఆర్, మహేష్ వేదిక పంచుకొని చాలా కాలం అవుతుంది. 2018లో విడుదలైన భరత్ అనే నేను చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్, ఎన్టీఆర్ ఒకే వేదికపై సందడి చేశారు. మరలా ఇన్నేళ్ల తరువాత మహేష్, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు వేదిక ద్వారా కలిసి కనిపించనున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఎవరు మీలో కోటీశ్వరులు షో అత్యంత ప్రేక్షాదరణతో దూసుకుపోతుంది. మొదట్లో అనుకున్నంత టీఆర్పీ దక్కకున్నా, ప్రతివారం పెరుగుతూ పోతుంది. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో టాప్ సెలెబ్రిటీలు షోకి గెస్ట్స్ గా వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఈ షోలో సందడి చేశారు. 


తాజా ఎపిసోడ్ కి గెస్ట్స్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ రావడం జరిగింది. హాట్ సీట్ లో కూర్చున్న కొరటాల, రాజమౌళిని ఎన్టీఆర్ తనదైన ప్రశ్నలతో ఆకట్టుకున్నారు. కాగా మరో ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ ని హాట్ సీట్ లో కూర్చోబెట్టి, ప్రశ్నించనున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి మహేష్ గెస్ట్ గా వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 


ఇక ఎన్టీఆర్, మహేష్ వేదిక పంచుకొని చాలా కాలం అవుతుంది. 2018లో విడుదలైన భరత్ అనే నేను చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్, ఎన్టీఆర్ ఒకే వేదికపై సందడి చేశారు. మరలా ఇన్నేళ్ల తరువాత మహేష్, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు వేదిక ద్వారా కలిసి కనిపించనున్నారు. ఇద్దరు టాప్ స్టార్స్ పాల్గొనే ఈ  ఎపిసోడ్ టీఆర్పీ స్కై హై రేంజ్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. 
 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది