ప్రభాస్ లాంచ్ చేసిన ‘ఆకాశవాణి’ ట్రైలర్ చూసారా?

Surya Prakash   | Asianet News
Published : Sep 21, 2021, 07:44 AM IST
ప్రభాస్ లాంచ్ చేసిన ‘ఆకాశవాణి’ ట్రైలర్ చూసారా?

సారాంశం

ఈ నెల 24 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడిన కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఆ గూడెం ప్రజలకు ఓ వ్యక్తి రేడియోను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ రేడియో వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే కథాంశంగా తెలుస్తోంది. 

 ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కొత్త ఆర్టిస్టులతో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి.  దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా.. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సముద్రఖని, వినయ్ వర్మ, తేజ, ప్రశాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడిన కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఆ గూడెం ప్రజలకు ఓ వ్యక్తి రేడియోను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ రేడియో వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే కథాంశంగా తెలుస్తోంది.

ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అడవిలో జీవనం సాగించే వాళ్లు ఎలా ఉంటారో ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలా జీవిస్తున్న వాళ్లపై అక్కడ దొర చేసే అరాచకాలు.. దాడులు మనం ట్రైలర్‌లో చూడొచ్చు. అలాంటి అలాంటి గిరిజనులకు సహాయం చేసే పాత్రలో సముద్రఖని మనకు కనిపిస్తున్నారు. ట్రైలర్‌లోని లోకేషన్లు, డైలాగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. కాలా భైరవ సినిమాకు సంగీతం సమకూర్చారు. 

ఇప్పటికే రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక కొద్దిరోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘దిమ్సారే’ అనే లిరికల్‌ వీడియోకి కూడా విశేషమైన స్పందన లభించింది. గిరిజనులు చేసుకొనే జాతరలో వాళ్లు ఎలా సంబురాలు చేసుకుంటారో.. ఈ పాటలో చూపించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ బయటకు వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్‌ని లాంచ్ చేశారు.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా విడుదల వాయిదాపడింది. తాజాగా ప్రముఖ ఓటీటీ ‘సోనీ లివ్’లో ఈ సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోంది.
 

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది