సదా పేరు మార్చుకుంది.. మళ్లీ వస్తోంది కదా.. లక్కు కోసమట

Published : Sep 27, 2017, 03:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సదా పేరు మార్చుకుంది.. మళ్లీ వస్తోంది కదా.. లక్కు కోసమట

సారాంశం

జయం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సదా అపరిచితుడు ప్రాజెక్ట్ లో శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన నటించిన సదా సదా అనే పేరు అచ్చికి రాక పేరు మార్చుకున్న సదా  

జయం సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సదా. అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వటానికి సదాఫ్ అనే పేరులో ఫ్ కట్ చేసి సదా అని పెట్టుకుని అదేపేరుతో కంటిన్యూ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన వైద్యుడు, బ్యాంకు ఉద్యోగినిల కుమార్తె జ‌యం మూవీతో సినిమాల్లో అడుగు పెట్టిన సదా ఆ త‌ర్వాత ప‌లు మూవీల్లో న‌టించింది. శంకర్ మూవీ అపరిచితుడులో విక్రమ్ సరసన న‌టించి అంద‌ర్ని ఆక‌ర్షించింది.

 

ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ల హవా బాగా పెరిగిపోవడంతో ఈ అమ్మడికి సినిమా చాన్సులు తగ్గాయి. ఆ తరువాత ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో బుల్లి తెరపై దృష్టి సారించింది. పలు షోలకు ఆమె జడ్జిగా వ్యవహరించింది. తాజాగా మరోసారి ఈ అమ్మడు వెండి తెరపై మెరవాలని చూస్తుంది.

 

సినిమాల్లో తిరిగి హీరోయిన్ గా చేయాలని భావిస్తున్న... ప‌నిలో ప‌నిగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదిస్తే పేరు మార్చుకోమ‌న్నాడ‌ట‌.. దీంతో ఆమె పేరును మార్చేసుకుంది. ఇప్పటి వరకు సదాఫ్, సదాగా ఉన్న తన పేరు ఇప్పుడు సధా సయ్యద్‌ గా మారినట్టు తెలిపింది. 33 ఏళ్ల వయసులో ఈ కొత్తపేరుతో తనకు అంతా కలిసొస్తుందని ఆశిస్తోంది.

 

సదా అసలు పేరు సదాఫ్ మహమ్మద్ సయిద్. కానీ జయం సినిమా నుంచి సదా ఆని స్క్రీన్ నేమ్ మార్చుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తన పేరును మార్చుకుంది. ఇప్పటికే తన పీఆర్ లకి కి కూడా ప్రమోట్ చేయమని సదా తెలిపిందట. మరి ఇప్పటికే "ముదురు" అనే మార్క్ వేసుకున్న సదాఫ్ కి ఇప్పుడు పేరు మారటం వల్ల అవకాశాలు వరిస్తాయా అన్నదే ఇక్కడ ప్రశ్న.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్