గుడ్లల్లో నీళ్లు తిరిగాయి-మహేష్ బాబు

Published : Sep 26, 2017, 10:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
గుడ్లల్లో నీళ్లు తిరిగాయి-మహేష్ బాబు

సారాంశం

స్పైడర్ రిలీజ్ కు మరి కొద్ది గంటలు ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ తమిళనాడు రిలీజ్ పై మహేష్ భావోద్వేగం

స్పైడర్ చిత్రం రిలీజ్ మరి కొన్ని గంటల్లోనే.. ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. తెలుగులోనే కాక తమిళంలోనూ స్పైడర్ రిలీజ్ అవుతోంది. రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. మురుగదాస్ దర్శకత్వంలో తమిళ ఆడియెన్స్‌కి పరిచయం అవడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. రేపే స్పైడర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి మహేష్ బాబు స్పైడర్ యూనిట్ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడాడు.

 

ఈ సందర్భంగా మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి చెబుతూ.. ''తమిళనాడుకి స్పైడర్ సినిమా ప్రమోషన్స్‌కి వెళ్లినప్పుడు అక్కడి ఆడియెన్స్ నుంచి తనకి లభించిన ఘన స్వాగతం చూశాకా నిజంగానే కళ్లలో నీళ్లు తిరిగాయి" అని ఆనందం వ్యక్తంచేశాడు. స్పైడర్ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ ఎలా ఎదురుచూస్తున్నారో తమిళ ఆడియెన్స్ కూడా అలాగే ఎదురుచూస్తున్నారని చెబుతూ మహేష్ బాబు ఈ వ్యాఖ్యలు చేశాడు.



తమిళ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే దర్శకులలో ఒకరైన మురుగదాస్ తో కలిసి పనిచేయడం తనకి మరిచిపోలేని అనుభవం అని, మురుగదాస్ తో కలిసి పనిచేసే క్రమంలో తాను ఎంతో నేర్చుకున్నానని మహేష్ బాబు అభిప్రాయపడ్డాడు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్