వైరల్ పిక్: 'వకీల్ సాబ్' గా సచిన్ టెండూల్కర్

Surya Prakash   | Asianet News
Published : Apr 24, 2021, 04:43 PM IST
వైరల్ పిక్: 'వకీల్ సాబ్' గా సచిన్ టెండూల్కర్

సారాంశం

స్టార్ స్పోర్ట్స్ తెలుగు ...షేర్ చేసిన ఈ ఫొటో అచ్చం పవన్ ..వకీల్ సాబ్ ని గుర్తు చేస్తోంది. దాంతో ఈ ఫొటోని తెగ షేర్ చేస్తున్నారు పవన్ అభిమానులు.

క్రికెట్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుని, భారతరత్నంతో మెరిసిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురువారం 48వ యేటలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియా నిండా పుట్టిన రోజు శుభాకాంక్షలు తో ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. #HappyBirthdaySachin హాష్ ట్యాగ్ ట్విట్టర్ మారు మ్రోగుతోంది. అదే సమయంలో సచిన్ కు చెందిన ఓ ఫొటో పవన్ అభిమానులును ఇట్టే ఆకట్టుకుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ...షేర్ చేసిన ఈ ఫొటో అచ్చం పవన్ ..వకీల్ సాబ్ ని గుర్తు చేస్తోంది. దాంతో ఈ ఫొటోని తెగ షేర్ చేస్తున్నారు పవన్ అభిమానులు.

ఈ వైరల్ పోస్ట్ లో  క్రికెట్ గాడ్, టీమిండియా మాజీ ఓపెనర్ సచిన్ ..పవన్ లా పడుకుని ఓ పుస్తకం చదువుకుంటున్నారు. ఆయన జెర్సీ ప్రక్కన ఉంది. దాంతో ఈ ఫొటో చూసిన పవన్ ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. పవన్ కు, సచిన్ కు కలిసిన వీరాభిమాని మాట అయితే ఇక చెప్పక్కర్లేదు.  ఇక పర్శనల్ విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

”కరోనా టెస్టు చేయించుకోగా.. నాకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కుటుంబంలో మిగిలిన వారికి నెగటివ్ తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన ఆరోగ్య సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు” అని సచిన్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడాయన పూర్తిగా కోలుకుని హాస్పటిల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇంటి వద్ద ఐసోలేషన్ లో ఉంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?