'RX 100' బ్యూటీ ఐటెం సాంగ్.. చరణ్ కి నో.. బెల్లంకొండకి ఓకే..!

Published : Sep 15, 2018, 01:14 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
'RX 100' బ్యూటీ ఐటెం సాంగ్.. చరణ్ కి నో.. బెల్లంకొండకి ఓకే..!

సారాంశం

పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ 'RX 100' చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది. మొదటి సినిమాతోనే యూత్ లో క్రేజ్ దక్కించుకుంది ఈ భామ. సినిమాలో తన అందాల ప్రదర్శనతో అందరినీ కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు చుట్టుముడుటున్నాయి. 

ఇప్పటికే దర్శకుడు భాను శంకర్ దర్శకత్వంలో యాక్షన్ సినిమాలో నటించడానికి అంగీకరించింది. తాజాగా ఓ ఐటెం సాంగ్ లో నటించడానికి ఓకే చెప్పిందని టాక్. నిజానికి రామ్ చరణ్-బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగితే రిజెక్ట్ చేసిన పాయల్ ఓ యంగ్ హీరో సినిమాలో మాత్రం నటించడానికి అంగీకరించింది.

దానికి పారితోషికం కారణమని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు తేజ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తుండగా.. పాయల్ ని ఐటెం సాంగ్ కోసం సంప్రదించారట.

భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో అమ్మడు ఓకే చెప్పినట్లు సమాచారం. యూత్ లో ఆమెకున్న క్రేజ్ కారణంగా సినిమాలో ఆమె ఐటెం సాంగ్ బాగా క్లిక్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఐటెం సాంగ్ లో తన అందాలతో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు