క్షమాపణలు చెప్పినా.. మహేష్ ఫ్యాన్స్ విడిచిపెట్టడం లేదు!

By Udayavani DhuliFirst Published Sep 15, 2018, 12:29 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేస్తూ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ ని కత్రినా కైఫ్ మేల్ వెర్షన్ అని, బండరాయిలా ఎక్స్ ప్రెషన్స్ లేకుండా ఉంటాడని నోటికొచ్చినట్లు కామెంట్స్ చేశాడు

సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేస్తూ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ ని కత్రినా కైఫ్ మేల్ వెర్షన్ అని, బండరాయిలా ఎక్స్ ప్రెషన్స్ లేకుండా ఉంటాడని నోటికొచ్చినట్లు కామెంట్స్ చేశాడు.

దీంతో సైలెంట్ గా ఉండే మహేష్ ఫ్యాన్స్ కాస్త అతడిపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని వేల కామెంట్స్ తో మనోజ్ సోషల్ మీడియా పేజీ నిండిపోయింది. అతడి అకౌంట్లో ఫోన్ నెంబర్ దొరకడంతో నేరుగా ఫోన్లు చేసి దూషించినట్లు తెలుస్తోంది.

దెబ్బకు మనోజ్ దిగొచ్చి క్షమాపణలు చెబుతూ ఓ వీడియోని విడుదల చేశాడు. తాను మహేష్ బాబుపై వ్యక్తిగత ఉద్దేశంతో విమర్శలు చేయలేదని, కేవలం తన వీడియో హైలైట్ అవ్వాలనే చేశానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అతడు క్షమాపణలు చెప్పినా.. మహేష్ ఫ్యాన్స్ మాత్రం విడిచిపెట్టలేదు. కోలీవుడ్ లో మహేష్ కి వస్తోన్న క్రేజ్ ని ఓర్వలేక ఇలా చేస్తున్నారంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

మహేష్ బాబు ఓ బండరాయి.. ముఖంలో ఎక్స్ ప్రెషన్సే ఉండవు.. స్టాండప్ కమెడియన్ కామెంట్స్!

click me!